• నెల్లూరు కనకమహాలక్ష్మి సెంటర్ లో స్వర్ణకారులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
• స్వర్ణకారుల్లో విశ్వబ్రాహ్మణులే కాకుండా ముస్లిం, ఇతర కులాల వారు కూడా ఉన్నారు
• విశ్వబ్రాహ్మణులకు తాళిబొట్లు తయారు చేసే హక్కు కల్పించాలి.
• జీవో.నెంబర్ 272ను సవరించి స్వర్ణకారులపై పోలీసుల వేధింపుల నుండి కాపాడాలి.
• గడిచిన నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు.
• టీడీపీ హయాంలో ఆదరణ ద్వారా పనిముట్లు ఇచ్చి వృత్తి పరంగా ప్రోత్సహించారు.
• స్వర్ణకారులకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి, సబ్సిడీ రుణాలు అందించాలి.
• స్వర్ణకారులకు శిక్షణా కేంద్రాలు నెలకొల్పి, ఐడీ కార్డులు అందజేయాలి.
• స్వర్ణకారులు నిత్యం పొగ, రసాయనాల మధ్య పని చేస్తూ అనారోగ్యం బారిన పడుతున్నారు, బీమా సౌకర్యం కల్పించాలి.
• 50 ఏళ్లు దాటిని వారికి పింఛన్ మంజూరు చేయాలి.
• విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ మోసం చేశారు.
• నెల్లూరులో స్వర్ణకారుల సంక్షేమ భవనాన్ని ఏర్పాటు చేయాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• జగన్మోహన్ రెడ్డి పాలనలో స్వర్ణకారులతోపాటు అన్ని బిసి సామాజికవర్గాల వారు బాధితులే.
• కులానికొక కుర్చీలేని కార్పొరేషన్ ఏర్పాటుచేసిన జగన్… బిసిలను దారుణంగా మోసగించారు.
• టీడీపీ అధికారంలోకి వచ్చాక స్వర్ణకారులు ఎటువంటి వేధింపులు లేకుండా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తాం.
• చంద్రన్న బీమా ద్వారా స్వర్ణకారులను ఆదుకుంటాం.
• అధికారంలోకి రాగానే స్వర్ణకారుల నూతన డిజైన్ల కోసం స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్ల ద్వారా శిక్షణ ఇచ్చి, అధునాతన పనిముట్ల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు అందజేస్తాం.
• స్వర్ణకారులకు ఆరోగ్య బీమా, ఐడి కార్డులు అందజేస్తాం.
• నెల్లూరులో స్వర్ణకారుల భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.