• నెల్లూరు ఆత్మకూరు బస్టాండులో మీ – సేవా కార్మికులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
• 2003లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం అన్ని రకాల సేవలు ఒకేచోట అందించాలన్న ఉద్దేశంతో ఈ-సేవా వ్యవస్థను ప్రారంభించింది.
• ఐటీ శాఖ పరిధిలో 170 అర్బన్ మీ సేవా కేంద్రాల్లో 607 ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తూ, 376 రకాల సేవలు ప్రజలకు అందిస్తున్నాం.
• ప్రస్తుతం మీ-సేవ పేరుతో కొనసాగుతున్న ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.4 వేల కోట్లు, మరో రూ.50 కోట్లు యూజర్ ఛార్జీల రూపంలో ఆదాయం సమకూరుతోంది.
• వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వ మీ-సేవ కేంద్రాలు మూసేసింది.
• దీంతో 19 ఏళ్లుగా నుండి ఆధారపడి జీవిస్తున్న 607 మంది మీ-సేవా సిబ్బంది రోడ్డున పడింది.
• మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 170 ప్రభుత్వ అర్బన్ మీ-సేవా కేంద్రాలను ప్రారంభించి, మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్నిరకాల ఉద్యోగులు తీవ్ర దగాకు గురయ్యారు.
• అధికారం కోసం పాదయాత్ర సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని జగన్ నెరవేర్చలేదు.
• గత ప్రభుత్వ హయాంలో మీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని కమీషన్ కూడా పెంచాం.
• టీడీపీ అధికారంలోకి వచ్చాక మీ-సేవ కేంద్రాలను కొనసాగించి, సిబ్బంది మరింత సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటాం.
• మీ – సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు జారీ చేసే అన్ని రకాల సర్టిఫికేట్లు అధికారికంగా ఉండేలా గుర్తిస్తాం.