• నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన బీసీ ప్రతినిధులు వడ్డెపాలెం నారాయణ మెడికల్ కాలేజి జంక్షన్ లో నారా లోకేష్ ను కలిసి వినతి పత్రం అందించారు.
• వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలు దగాకు గురయ్యారు.
• బీసీలకు న్యాయం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ మా అభివృద్ధిని పట్టించుకోవడం లేదు.
• చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవు.
• యేటా జాబ్ నోటిఫికేషన్ ఇస్తానని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు…నాలుగేళ్లలో కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు.
• నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి.
• బీసీ సంక్షేమ హాస్టళ్లను నిర్వీర్యం చేశారు.
• బీసీ కులవృత్తుల వారికి పనిముట్లు అందించడం లేదు.
• ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే గూండాలు, రౌడీలతో మా గొంతునొక్కుతున్నారు.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• జగన్ అధికారంలోకి వచ్చాక కులానికొక కుర్చీలేని కార్పొరేషన్ ఏర్పాటు చేయడం తప్ప బీసీలకు ఒరిగించేమీ లేదు.
• బిసిలకు చెందాల్సిన రూ.75,760 కోట్లు దారిమళ్లించిన బిసి ద్రోహి జగన్మోహన్ రెడ్డి.
• అన్యాయాలను ప్రశ్నించిన బిసిలపై దాడులు చేస్తూ గొంతునొక్కాలని చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బిసిలపై 26వేలకు పైగా తప్పుడు కేసులు నమోదుచేశారు.
• టిడిపి అధికారంలోకి రాగానే బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం.
• ఆదరణ పథకాన్ని పునరుద్దరించి కులవృత్తులు చేసుకునే వారికి 90శాతం సబ్సిడీపై పనిముట్లు అందజేస్తాం.
• ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేస్తాం.
• పెద్దఎత్తున పరిశ్రమలు రప్పించి ఉద్యోగావకాశాలు కల్పిస్తాం, ఉద్యోగం వచ్చేవరకు యువగళం నిధికింద యువతకు రూ.3వేల రూపాయల పెన్షన్ ఇస్తాం.