- నిజాయితీగా ఉండాలని తాత, నాన్నను చూసి నేర్చుకున్నా
- పనికిమాలిన కేసులకు భయపడను
- కార్యకర్తల పార్టీ అంటే టీడీపీనే
- గజపతినగరం సభలో లోకేష్
గజపతినగరం: నేను ఏనాడూ తప్పు చేయలేదు.. ఎప్పుడూ చేయబోనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు 1500 ఫైల్స్ క్లియర్ చేశా.. ఒక్క ఫైల్‌లో తప్పు చేసినట్లు నిరూపించినా రాజకీయాలకే దూరంగా ఉంటానని సవాల్ విసిరారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో శుక్రవారం జరిగిన శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు అంత పేరు రాకపోయినా.. వారికి నేనెప్పుడూ చెడ్డపేరు తీసుకురాను. నిజాయితీగా ఉండాలని మా తాత, మా నాన్నను చూసి నేర్చుకున్నా. నేను జగన్‌లా పరదాలు కట్టుకొని తిరగటంలేదు, దమ్ముగా ప్రజల మధ్య 3132 కి.మీ. లు తిరిగా. పట్టుదలతో, క్రమశిక్షణతో పార్టీకోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.
భయమంటే తెలియదు
మనపై ఇప్పటివరకు అనేక కేసులు పెట్టారు. నాపై 22 కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, హత్యాయత్నం కేసులు కూడా పెట్టారు. అయినా తగ్గేదే లేదు. బాంబులకే భయపడలేదు. జగన్ పెట్టే పనికి మాలిన కేసులకు నేను భయపడను.భయం మా బయో డేటాలోనే లేదు. ఎన్టీఆర్ దేవుడు.. చంద్రబాబు రాము డు.. లోకేష్ మాత్రం వైసీపీ కార్యకర్తలకు మూర్ఖుడు. నేను ఎవర్నీ వదలిపెట్టను. ఏ అధికారులు చట్టాన్ని ఉల్లంఘించారో, ఏ వైసీపీ నేతలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారం దరి పేర్లు ఎర్రబుక్‌లో ఉన్నాయి.వడ్డీతో సహా చెల్లిస్తాం. ఎర్రబుక్ చూస్తే వైసీపీ వాళ్లకు కారిపోతోంది. నన్ను అరెస్టు చేయాలని కోర్టుకు వెళ్లారు. ఎందుకు భయ పడుతున్నారు? చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు ఎర్ర పుస్తకంలో ఉన్నాయి. మేం వచ్చిన తర్వాత విచారించి జైలుకు పంపిస్తాం. అందుకే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోర్టుకు వెళ్లారు. బహిరంగసభల్లోనే మాట్లాడుతూన్నా దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేయండని లోకేష్ సవాల్ విసిరారు.
పసుపు జెండా చూస్తేనే ఉత్సాహం
టీడీపీ బలం కార్యకర్తలు. నాయకులు పార్టీ మారి వెళ్లినా టీడీపీకి కార్యకర్తలు అండగా ఉన్నారు. దేశం లోనే కార్యకర్తల పార్టీ ఏదంటే అది టీడీపీనే. వైకాపా కార్యకర్తలకు బూమ్ బూమ్ కావాలి కానీ.. పసుపు సైన్యానికి చంద్రబాబు ఒక్క పిలుపునిస్తే చాలు ఎక్కడా లేని ఊపు వస్తుంది. ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ పెట్టారో కానీ పసుపు జండా చూస్తే నూతన ఉత్సాహం వస్తుంది. 2014లో కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో చనిపోతే రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించాం. టీడీపీ బలం కార్యకర్తలు. దేశంలోనే కార్యకర్తల పార్టీ టీడీపీ. నాయకులు వెళ్ళినా కార్యకర్తలు అండగా ఉన్నారు. గత ఐదేళ్లుగా ఎన్ని కేసులు పెట్టినా మడమ తిప్పకుండా టీడీపీకి కాపలా కాశారు. మీ రుణం తీర్చుకునేందుకు కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటుచేసి ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు రూ.2 లక్షలు ఇచ్చాం. ఇప్పటి వరకు వందకోట్లు ఖర్చు చేశాం. బాధిత కుటుంబాల పిల్లలను నా తల్లి భువనేశ్వరి చదివిస్తున్నారు.నాకు అన్నాచెల్లెళ్లు లేరు..అక్కా తమ్ముడు లేరు.. కానీ 60లక్షల కార్యకర్తల మంది కుటుంబ సభ్యులను ఎన్టీఆర్ ఇచ్చారుమనం అందరం ఒకే కుటుంబం. అందరం కలిసి ముందుకు వెళ్లాలని లోకేష్ పిలుపు ఇచ్చారు.
రూ. 855 కోట్లతో అభివృద్ధి
గజపతినగరం నియోజకవర్గంలో కొండపల్లి అప్పల నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రూ.855 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. 4వేల టిడ్కో ఇళ్లు కట్టాం. డిగ్రీ కాలేజ్, జూనియర్ కళాశాల, జ్యోతి బాపూలే మోడల్ స్కూల్ కోసం నిధులు కేటాయించాం. అనేక బ్రిడ్జిలు కట్టాం. భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ ఆధు నీకరణ కోసం రూ.13కోట్లు కేటాయిస్తే, వాటిని రద్దు చేసి మూసేశారు. పంచాయతీ భవనాలు, అంగన్ వాడీ భవనాలు నిర్మించాం. సీసీ రోడ్ల కోసం రూ.300 కోట్లు, బీటీ రోడ్లకు 100 కోట్లు ఖర్చు పెట్టాం. సురక్షిత మంచినీటి కోసం రూ.80కోట్లు ఖర్చు పెట్టాం. జగన్ ఇక్కడ పాదయాత్ర చేసినప్పుడు డిగ్రీ కళాశాల పూర్తి చేస్తామన్నారు, పూర్తిచేశాడా? తోటపల్లి రిజర్వాయర్ నుంచి గజపతి నగర బ్రాంచ్ కెనాల్‌కు నీళ్లు తీసు కొస్తానని విస్మరించారు. మిగతా రిజర్వాయర్లు కూడా పూర్తిచేస్తామని, ఆధునీకరిస్తామని చెప్పి గాలికొదిలేశా రని లోకేష్ దుయ్యబట్టారు.
భూమి కనిపిస్తే కబ్జానే
ఇక్కడ ఎమ్మెల్యే గురించి ఎంత చెప్పిన తక్కువే. బొత్స అప్పల నర్సయ్య. ఆయన ఇంటిపేరు మార్చు కోవాలి.
బొత్స కాదు.. భూకబ్జాదారుడని. ఎక్కడ భూమి దొరికినా కాజేస్తాడు. కుటుంబాల మధ్య చిచ్చుపెట్టి భూములు లాగేస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ భూములు లాక్కుంటున్నారు. విచ్చలవిడిగా ఇసుకను దోచేస్తున్నా రు. టీడీపీ హయాంలో వెయ్యి రూపాయలకు ఇసుక లభించేది. నేడు రూ.5వేలు అయింది.మిగతా నాలుగు వేలు మీరు తింటున్నారా,బొత్స సత్యనారాయణ తింటు న్నారా, జగన్ తింటున్నారా? రెండు నెలల్లో టీడీపీ-జనసేన వస్తుంది.తిన్న ప్రతిరూపాయిని కక్కించి ప్రజల కోసం ఖర్చు చేస్తాం.
గజపతినగరంలో టీడీపీ-జనసేన బలపరిచిన అభ్యర్తిని గెలిపిస్తే.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తిచేస్తాం. బొత్స కుటుంబం తమ స్వార్థం కోసం పోలవరం లెఫ్ట్ కెనాల్ అలైన్‌మెంట్ మార్చింది. మేం వస్తే పాత అలైన్‌మెంట్ ప్రకారం కాల్వల కాల్వల నిర్మాణం చేపట్టి, గ్రావిటీపై నీళ్లిస్తాం. నాగావళి-చంపా వతి-గోస్తనీ నదులు అనుసంధానంచేసి బ్రాంచ్ కెనాల్ ద్వారా సాగునీరు అందిస్తాం. కొండపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తిచేస్తాం. పరిశ్రమలు ఏర్పాటుచేసి స్థానికు లకే ఉద్యోగాలు ఇస్తాం. గంజాయి వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. గంజాయి లేని గజపతినగరంగా మారుస్తా మని లోకేష్ హామీ ఇచ్చారు.