- నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులోకి తెస్తాం
- గత పాలకులు ఆదాయం కోసం అడ్డదారులు తొక్కారు
- కమీషన్ల కోసం కల్తీ బ్రాండ్లను ప్రజల నెత్తిన రుద్దారు
- వాటి నుంచి రాష్ట్ర ప్రజలకు పూర్తిగా విముక్తి కల్పిస్తాం
- ఆదాయం కంటే ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం
- గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర
అమరావతి(చైతన్యరథం): ప్రజల ప్రాణాలు హరిస్తున్న కల్తీ మద్యం బ్రాండ్ల నుంచి విముక్తి కలిగించేలా అక్టోబరు 1 నాటికి మెరుగైన పాలసీ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సచివాలయంలో బుధవారం మద్యం తయారీ ఎంఎన్సీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014-19 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని కేవలం ప్రైవేటు వ్యాపారంగా మాత్రమే భావించిందని, దేశం మొత్తం లభించే బ్రాండ్లను ఏపీలో కూడా అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. కానీ, 2019లో ప్రభుత్వం మారిన తర్వాత నాటి పాలకులు మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని ప్రజల ప్రాణాలు హరించారని, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని మండిపడ్డారు.
- సంక్షేమ పథకాలకు, మద్యం అమ్మకాలకు ముడి వేసి ప్రజల ఆదాయాన్ని హరించారన్నారు. అమ్మకాలకు, కొనుగోళ్లకు సంబంధమే లేకుండా వేల కోట్లు దోచుకున్నారని పేర్కొన్నారు. దేశమంతా డిజిటల్ పేమెంట్ల వైపు వెళుతుంటే ఏపీలో మాత్రం క్యాష్ అండ్ క్యారీ విధానంలో మద్యం అమ్మ కాలతో వేల కోట్ల లూటీ చేశారని ధ్వజమెత్తారు. వినియోగదారుడు తనకు నచ్చిన బ్రాండ్ కాకుండా.. ధర చెప్పి కొనుగోలు చేసే దుస్థితి కల్పించారని, పైగా కల్తీ మద్యం తీసుకొచ్చి వేలాది మంది మరణాలకు, అనారోగ్యానికి కారమయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగిన మద్యం అక్రమాలను త్వరలోనే బయటపెడతామని తెలిపారు. అక్టోబర్ 1 నాటికి నూతన మద్యం పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని, అందుకోసం మెరుగైన పాలసీల కోసం అధ్యయనం చేస్తున్నామని వెల్లడిరచారు. నాణ్యమైన మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు.