- బట్టీ విధానానికి స్వస్తి.. సృజనాత్మకత పెంపే లక్ష్యం
- విద్యార్థి దశలో నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలు
- అమలులో కొన్ని సమస్యలు ఉన్నా వాటిని అధిగమిస్తాం
- ఐదేళ్లలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైంది
- విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకురావాలి
- వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి వై.సత్యకుమార్
విజయవాడ(చైతన్యరథం): నూతన జాతీయ విద్యా విధానం-2020 ఉపాధ్యాయు లు, విద్యార్థులకు వరమని, ఈ విధానం విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ అన్నారు. ‘ఉన్నత విద్యాసంస్థల్లో జాతీయ విద్యా విధానం-2020 అమలు, సవాళ్లు’ అనే అంశంపై అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక్ మహాసంఘ్, విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ శనివారం సంయుక్తంగా ప్రారంభించిన రెండురోజుల సెమి నార్ ప్రారంభోత్సవ సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. దేశాన్ని అన్ని రంగాల్లోనూ సమున్నత స్థానానికి తీసుకెళ్లే లక్ష్యంగా మోదీ ప్రారంభించిన గొప్ప కార్యక్రమాల్లో ‘జాతీయ విద్యా విధానం-2020’ ఒకటని పేర్కొన్నారు. బట్టీ విధానానికి స్వస్తి పలికి సృజనాత్మకత పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశమన్నారు. విద్యార్థి దశ లోనే నైపుణ్య శిక్షణతో స్వయం ఉపాధితో పాటు చదువుకునే వెసులుబాటు ఉంటుంద న్నారు. ఏ దేశంలో అయినా విద్యాభివృద్ధి ఉంటేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని, ఇది సాకారమవ్వాలంటే భారతీయ విలువలతో కూడిన విద్యావిధానం అవసరమని పేర్కొ న్నారు. జాతీయ విద్యా విధానం-2020 అచ్చంగా అలాంటిదేనని అభివర్ణించారు.
దేశాభివృద్ధిలో నూతన విద్యా విధానం కీలకపాత్ర
ఎనిమిదో తరగతి నుంచి ఇతర దేశాల భాషలు నేర్చుకునే అవకాశం కూడా నూతన విద్యా విధానంలో ఉందని పేర్కొన్నారు. కష్టతరమైన విద్య నుంచి నూతన టెక్నాలజీ పరిజ్ఞానంతో ఉండే విద్యా విధానం అందుబాటులోకి రావటం వల్ల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భారతదేశం అభివృద్ధిలో ఈ నూతన జాతీయ విద్యా విధానం పాలసీది కీలక పాత్ర అని వివరించారు. నూతన విద్యా విధానం అమల్లో కొన్ని సమస్యలు, సవాళ్లు ఉన్న మాట వాస్తవమేనని, వాటిని అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం తెచ్చిన ఈ కొత్త విద్యా విధానాన్ని రాష్ట్రాలు ఆమోదించడమే మొట్టమొదటి సవాల్‌గా అభిప్రాయపడ్డారు.
అందువల్లే ఇంజనీరింగ్ పూర్తిచేయలేకపోయా
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 29 జాతీయ విద్యా సంస్థల ను కేంద్రం ఇచ్చిందని తెలిపారు. భారతీయ విలువను జోడిరచి కొత్త విద్యా విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత పాలకులు సరైన విద్యా విధానం, ఆర్థిక విధానం తీసుకురావడంలో విఫలమయ్యారని ఆరోపించారు. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినందు వల్ల తాను ఇంజనీరింగ్ పూర్తి చేయలేకపోయానని మంత్రి గుర్తు చేసుకున్నారు. అందరూ ప్రభుత్వ ఉద్యోగులే కావాలంటే సాధ్యం కాదని, ప్రైవేటు సంస్థలలో రాణించాలంటే నైపుణ్య శిక్షణ చాలా అవసరమని సూచించారు.
ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలి
భాష ఏదైనా మాతృభాషను మరిచిపోకూడదని సత్యకుమార్ తెలిపారు. మాతృభాష తోనే రాణించిన దేశాలున్నాయని వివరించారు. ఉదాహరణకు చైనా, జపాన్‌లు పారిశ్రామికంగా ఎలా ఎదుగుతున్నారో పరిశీలించాలని సూచించారు. ప్రాథమిక విద్య మొత్తం మాతృ భాషలో ఉంటేనే వారిలో సృజనాత్మకత బయటకు వస్తుందన్నారు. అన్ని దేశాల్లో ఇది అమలవుతున్నా మన దేశంలో మాత్రం పర భాషపై మోజు పెరిగిందన్నారు.
సెమినార్‌కు లోకేష్ అందుకే రాలేదు
సెమినార్‌కు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రావాల్సి ఉన్నప్పటికీ మరో అత్యవసర సమావేశం వల్ల రాలేకపోయారని తెలిపారు. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతమేర నిధులు ఇస్తున్నాయో ఆలోచించాలని, విద్యార్థుల కోసం కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా ముందుకురావాలని కోరారు. మనదేశంలో ఒక మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు సృష్టించాలంటే సాంకేతికతో కూడిన విద్య అవసరమని అభిప్రాయపడ్డారు. భారతీయ విలువలతో కూడిన విద్యావిధానం లేకపోవటంతోనే దేశం భ్రష్టు పట్టిందన్నారు. దీన్ దయాళ్ వంటి కార్యక్రమాలతో లోకల్ తయారీ విధానానికి స్వాగతం పలికామని తెలిపారు.
విద్యపై ఎక్కువ ఖర్చు చేయాలి
సౌత్ కొరియా, అమెరికా వంటి దేశాలలో విద్యపై ఎక్కువ ఖర్చు పెడుతున్నారని వివరించారు. మన దేశంలో కూడా విద్యపై ఎక్కువ ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు నూతన విద్యావిధానంపై తమ అభిప్రాయాలను వెల్లడిరచారు. ప్రజలకు నూతన విద్యా విధానం తెలియజేసి అమల య్యేలా చూడాలని ప్రతిఒక్కరినీ కోరుతున్నామని తెలిపారు. తొలిరోజు సెమినార్‌లో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ శ్రీకొండ రమేష్, నేషనల్ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గుంతా లక్ష్మణ్, యూనివర్సిటీ నిధుల సంఘం (యూజీసీ), ఢల్లీి జాయింట్ సెక్రటరీ, అవిచల్ రాజ్‌కపూర్, సిద్ధార్థ అకాడమీ అకడమిక్ అడ్వైజర్ నార్ల వినయ్‌కుమార్, అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక్ మహాసంఫ్‌ు సభ్యులు, అధ్యాపకులు, ఫ్రొపెసర్లు, ఉపాధ్యాయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.