- 23న గ్రామసభలను విజయవంతంగా నిర్వహించాలి
- ప్రతి గ్రామసభకు ప్రత్యేక అధికారిని నియమించాలి
- కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ఆదేశం
- గ్రామసభలు, ఇసుక విధానంపై వీడియో కాన్ఫరెన్స్
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో సెప్టెంబరు 11 నుంచి నూతన ఇసుక విధానాన్ని అమలులోకి తేనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ వెల్లడిరచారు. ఈ విధానం అమలుకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను వెంటనే జారీ చేయడం జరు గుతుందని, వాటిని తప్పక పాటించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గ్రామసభలు, ఉచిత ఇసుక విధానం అమలుపై బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడు తూ ఎక్కడా ఇసుక అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుకరీచ్‌ల వారీగా ఇసుక తవ్వకం, రవాణాకు సంబంధించిన ధరలను కలెక్టర్లు నిర్ధారించాలని, ఆ ధరలకు మించి ఎక్కువ ధరకు విక్రయించినట్టు ఫిర్యాదులు వస్తే ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.
అంతేకాకుండా ఆన్‌లైన్‌లో ఇసుక కోసం బుకింగ్ చేసిన వాహనాలకు ఏ తేదీన ఏ సమయంలో ఇసుకను తీసుకువెళ్లాలనేది స్పష్టంగా స్లాట్లు కేటాయించాలని సూచించారు. ఇసుక కోసం రిజిస్టర్ చేసిన వాహనాలను మాత్రమే రీచ్‌ల్లోకి అనుమతించాలని, ఇతర వాహనాలను ఎంతమాత్రం అనుమతించరా దని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాకు సంబంధించి సీడ్ యాక్సిస్ రోడ్డు, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి నందిగామ వద్ద పెద్దఎత్తున లారీలు, ట్రక్కులు గంటల తరబడి వేచి ఉంటు న్నట్టు గమనించామని అలాంటి పరిస్థితులు లేకుండా చూడాలని ఆ రెండు జిల్లాల కలెక్టర్లతో పాటు ఇతర జిల్లాల కలెక్టర్లకు స్పష్టం చేశారు.
23న ఒకరోజు గ్రామసభలను విజయవంతం చేయాలి
రాష్ట్రంలో ఈనెల 23న ఒకేరోజు నిర్వహించే గ్రామసభలను విజయవంతంగా నిర్వ హించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఉపాధి హామీపై ప్రజల్లో అవగాహన కల్పించడం తో పాటు గ్రామాల్లో విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి, గ్రామం నుంచి మండలాన్ని కలిపే అనుసంధానం చేసే రహదారులు నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పన, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ గ్రామసభలను ఉపయోగించాలని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు ఈ గ్రామసభల్లో పాల్గొనేలా చూడాలని సూచించారు. గ్రామసభల నిర్వహణను జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే విధంగా ఈ గ్రామసభలను విజయంతంగా నిర్వహించాలని సూచించారు.
గ్రామసభల మార్గదర్శకాలు తప్పక పాటించాలి
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 23న గ్రామసభల నిర్వహణకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకా లను తప్పక పాటించాలని సూచించారు. ముఖ్యంగా ఉపాధిహామీ పథకం అమలుకు సంబంధించి మంజూరైన పనులు, కొత్త పనుల గుర్తింపు, సామాజిక తనిఖీపై గ్రామసభల ద్వారా ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. అంతేకాకుండా గ్రామాల్లో నూరు శాతం కనీస సేవలు కల్పించడం, పామ్ పాండ్ల నిర్మాణం, ఉద్యానవన, పట్టు పరిశ్రమలకు తోడ్పాటు అందించడం, పశు షెడ్ల నిర్మాణం వంటి వాటిపై కూడా చర్చించి వాటి కల్పనపై దృష్టి సారించాలని సూచించారు.
ఇసుక రవాణా వాహనాలకు యూనిక్ నెంబర్ కేటాయించాలి
రాష్ట్ర భూగర్భ గనులశాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్‌కుమార్ మీనా మాట్లాడుతూ ఇసుక రీచ్‌ల నిర్వహణ, రవాణా, ధరల నిర్ధారణ అంశాలకు సంబంధించి కొన్ని గ్యాప్‌లు ఉన్నా యని వాటిని క్రమబద్ధీకరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గురువారం జిల్లాల్లో ట్రాన్స్‌పోర్టర్లను పిలిచి ఇసుక రవాణాకు వినియోగించే వాహనాల రిజిస్టర్ చేసి ఒక ప్రత్యేక యూనిక్ నెంబరును కేటాయించాలని సూచించారు. ఆ నెంబరు గల వాహనాలు మాత్రమే ఇసుక రవాణాకు ఉపయోగించాలని మరే ఇతర వాహనాలను ఇసుక రవాణాకు అనుమతించరాదని స్పష్టం చేశారు. ప్రతి రీచ్ వద్ద పోలీస్ చెక్‌పోస్టును ఏర్పాటు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. టోల్ ఫ్రీ నెంబరుపై జిల్లాల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.
గురువారం సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉచిత ఇసుక విధానంపై వివరిం చాలని ఆదేశించారు. ఇసుక విధానం అమలుకు సంబంధించి జిల్లా సంయుక్త కలెక్టర్‌ను కంట్రోలింగ్ అధికారిగా నియమించాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణా, అక్రమ మైనింగ్ వంటివి జిల్లాల్లో ఎక్కడ జరిగినా అందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీలే బాధ్యత వహిం చాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వీడియో సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ, భూగర్భగనుల శాఖ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, వర్చువల్‌గా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.