- వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తయారుచేస్తాం
- అమరావతి బ్రాండిరగ్‌తో ఐపీఎల్ క్రికెట్ జట్టును తెస్తాం
- గల్లీ నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి క్రీడాకారులకు ప్రోత్సాహం
- క్రీడా మైదానాలు, స్టేడియాల ఏర్పాటుకు చర్యలు
- విద్యా సంస్థల్లో ఒక గంట విద్యార్థులకు క్రీడలపై శిక్షణ
- క్రీడాకారులకు నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణంపై విచారణ
- ఆడుదాం ఆంధ్రాలో అవినీతిపై ఆధారాలు సేకరిస్తున్నాం
- ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం శాప్ పరిధిలోకి తెస్తాం
- అనుమతి లేని క్రీడా అకాడమీలను రద్దు చేస్తాం
- సీఎం సహకారంతో కేంద్రం నుంచి నిధులు తెస్తాం
- రవాణా, యువజన, క్రీడల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
విజయవాడ(చైతన్యరథం): రాష్ట్రాన్ని వచ్చే ఐదేళ్లలో స్పోర్ట్స్ హబ్‌గా తయారు చేస్తామని, అందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఏపీ క్రీడా సాధికార సంస్థ ఉన్నతాధికారులతో సోమవారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలోని సమావేశ మందిరంలో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిరచారు. గత ప్రభుత్వం క్రీడలను పూర్తిగా విస్మరించిందని, చివరలో ఆడుదాం ఆంధ్రా అంటూ అభాసుపాలు కార్యక్రమం నిర్వహించి, అందులో కూడా రూ.120 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఆధారాలను సేకరిస్తున్నామని వెల్లడిరచారు. వచ్చే ఐదేళ్లలో అమరావతి పేరుతో ఐపీఎల్ క్రికెట్ జట్టును ప్రమోట్ చేయనున్నట్టు చెప్పారు.
గల్లీ నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు క్రీడల ప్రోత్సాహకానికి కృషి చేస్తామని తెలిపారు. క్రీడాకారులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించి ఉత్తమ క్రీడాకారులుగా రాణించేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిం చడంలో భాగంగా అవసరమైన క్రీడా మైదానాలు, స్టేడియాల నిర్మాణానికి పెద్దపీట వేస్తామని వివరించారు. క్రీడా వికాస కేంద్రాలు, గ్రామస్థాయిలో క్రీడల నిర్వహణ, ప్రోత్సాహంపై సీఎంతో చర్చిస్తామని తెలిపారు. క్రీడాకారులకు నకిలీ సర్టిఫికెట్ల వల్ల నష్టం జరుగుతుందని తమ దృష్టికి వచ్చిందని, సర్టిఫికెట్ల కుంభకోణంపై విచారణ చేసి అసలైన క్రీడాకారులకు పూర్తి న్యాయం చేస్తామని తెలిపారు. క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా విద్యార్థులు ఆడుకోవడానికి ఒక గంట సమయం కేటాయించేలా టైం టేబుల్ ఏర్పాటు ఉండేలా ఆదేశాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.
క్రీడామైదానాలు లేని ప్రైవేటు పాఠశాలలకు నోటీసులు ఇస్తామని, అవసరమైతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రీడాపరంగా ప్రధాన సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తామని తెలిపారు. దేశ బడ్జెట్లో క్రీడలకు ప్రాధాన్యం ఉంటుందని, సీఎం చంద్రబాబు సహకారంతో మన రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి అధిక నిధులు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడిరచారు. ఉమ్మడి ఏపీలో గోపిచంద్ వంటి మేటి క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు అకాడమీ ఏర్పాటుకు తోడ్పాడు అందించడంతో దేశం గర్విచే క్రీడాకారులను తయారు చేయగలిగామని, అమరావతి, వైజాగ్‌లలో అకాడమీ ఏర్పాటుకు చంద్రబాబు భూమి కేటాయిస్తే గత వైసీపీ ప్రభుత్వం దానిని తుంగలో తొక్కి క్రీడలకు అన్యాయం చేసిందని మండిపడ్డారు.
సీఎం చంద్రబాబుతో చర్చించి త్వరలోనే కొత్త స్పోర్ట్స్ పాలసీని విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో అనుమతి లేని క్రీడా అకాడమీలను రద్దు చేస్తామని వివరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నిర్వహణ కార్పొరేషన్ పరిధిలో ఉందని, దీంతో గత ప్రభుత్వం కేవలం రాజకీయ కార్యక్రమాలకు ఎక్కువగా ఉపయోగించిందని, శాప్ పరిధిలోకి వచ్చే విధంగా కార్పొరేషన్ అధికారులతో చర్చిస్తామన్నారు. అలాగే పే అండ్ ప్లే జీవో వల్ల ఇబ్బందులుంటే దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఈ సమావేశంలో శాప్ అధికారులు పాల్గొన్నారు.