- పెట్టుబడులను చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు
- పారిశ్రామికవేత్తలను తరిమేయడమే వారి లక్ష్యం
- భూములిస్తే తప్పేంటని కోర్టే అక్షింతలు వేసింది
- సీఎం చంద్రబాబు విజనరీ అయితే..జగన్ ప్రిజనరీ
- అవాకులు, చవాకులు పేలితే ఖబడ్దార్
- మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ధ్వజం
అమరావతి(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనే త లోకేష్ బాబు కృషితో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే చూసి ఓర్వలేక అడ్డుకునే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తున్నారని శాసన మండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. ఒకేరోజు విశాఖలో 9 కంపెనీలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, తాత్కాలిక భవనంలో కాగ్నిజెంట్ కార్యకలాపాలు మొదలు పెట్టడం విశాఖలో నూతన టెక్ యుగానికి పలికిందని హర్షం వ్యక్తం చేశారు. శనివారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాల యంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకెళుతుండగా, ఒక్క విశాఖపట్నంలోనే 5 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా నారా లోకేష్ పనిచేస్తున్నారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక జే గ్యాంగ్ మాత్రం దుష్ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.
నాడు యువత చేతుల్లో గంజాయి.. నేడు ల్యాప్‌టాప్‌లు
‘‘వైసీపీ హయాంలో యువత చేతుల్లో గంజాయి, డ్రగ్స్‌కు బానిసలను చేశారు. నేడు యువత భవిష్యత్తుకు దారులు వేస్తున్న చంద్రబాబు, లోకేష్‌లపై నీచ ఆరోపణలు చేస్తున్నారు. అప్పట్లో యువతను మత్తులో ముంచిన జగన్ పాలనకు, నేడు యువత చేతుల్లో ల్యాప్‌టాప్‌లు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న కూట మి పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ హయాంలో ‘ప్రెసిడెంట్ మెడల్’, ‘ఆంధ్ర గోల్డ్’, ‘గవర్నర్ ఛాయిస్’, ‘బూమ్ బూమ్’, ‘బ్లాక్ బస్టర్’, ‘లెజండ్’, ‘పవర్ స్టార్ 999’, ‘సెవెన్ హార్స్’, ‘స్పెషల్ స్టేటస్’, ‘బ్యాచులర్ ఛాయిస్’, ‘ఎంగ్ స్టార్’ వంటి లిక్కర్ బ్రాండ్లు తెచ్చిన జగన్, నేడు అభివృద్ధి హబ్‌ల పేర్లు కూడా పలకలేని స్థితిలో ఉన్నారు. నేడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకు పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాను ఒక్కో హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఉమ్మడి విశాఖపట్నం ఐటీ, ఏఐ హబ్‌గా, శ్రీకాకుళం ఫిషరీస్, కోస్టల్ లాజిస్టిక్స్ హబ్‌గా, ఉమ్మడి గోదావరి జిల్లాలను పోర్ట్ బేస్డ్ మెట్రో కెమికల్/ఆక్వా హబ్‌గా, కృష్ణా ఫైనా న్స్, లాజిస్టిక్స్, అగ్రో ప్రాసెసింగ్ హబ్‌గా, గుంటూరును క్వాంటమ్, డ్రోన్, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా, ప్రకాశాన్ని ఫార్మా/కెమికల్ ప్రాసెసింగ్ హబ్‌గా, నెల్లూరును ఈవీ తయారీ/ ఈవీ కంపోనెంట్స్ హబ్‌గా, చిత్తూరును మ్యానుఫ్యాక్చరింగ్, టూరిజం, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ హబ్‌గా, అనంతపురాన్ని రిన్యూవబుల్ సోలార్ మిషన్ హబ్‌గా, కడపను ఐటీ/ టెక్ స్టార్టప్ హబ్‌గా తయారు చేయడానికి కూటమి ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతోందని తెలిపారు.
రాష్ట్రాభివృద్ధిపై జగన్ అండ్ కో విష ప్రచారం
యువత భవిష్యత్తు కోసం విశ్వసనీయత ఉన్న కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించడం తప్పా? చంద్రబాబు క్రెడిబిలిటీ, లోకేష్ దిక్సూచి మీద నమ్మకంతో గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, టెక్ మహీంద్ర, నార్వెల్ టెక్నాలజీస్, ఏషియన్ హెల్త్‌కేర్, ఇమాజినిటీ టెక్ సొల్యూషన్స్, ఫ్లూయంట్ గ్రిడ్, మదర్స్ అండ్ టెక్నాలజీస్ వంటి అనేక సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. శంకు స్థాపనలు కూడా జరిగాయి. కంపెనీలకు భూములు కేటాయించ డంపై అనవసర ఆరోపణలు చేసిన వైసీపీ నేతలకు హైకోర్టు ఇప్పటికే అక్షింతలు వేసింది. అయినా హైకోర్టు వ్యాఖ్యలను కూడా లెక్కచేయకుండా మాజీ మంత్రులు మాట్లాడటం దురదృష్టకరం. వైజాగ్‌లో ఏదో జరిగిపోతోందని, కంపెనీలకు భూములు ధారా దత్తం చేస్తున్నారనడం అవివేకం.
జగన్ హయాంలో రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలే భూకబ్జాల కోసం కొట్టుకున్న చరిత్ర ప్రజలకు తెలుసు. అప్పట్లో కిడ్నాప్‌లు, అక్రమాలు చేసిన వైసీపీ నేతలు నేడు కబ్జాలపై మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఉత్తరాంధ్రను రావణకాష్టంగా మార్చిన వైసీపీ నాయకులు ఇప్పుడు నీతులు చెప్ప డం హాస్యాస్పదం. చంద్రబాబు ఒక విజనరీ లీడర్ అయితే, జగన్ ఒక ప్రిజనరీ లీడర్. రాష్ట్రాన్ని ఎలా నిర్మించాలో చంద్రబాబుకు తెలుసు, ఎలా విధ్వంసం చేయాలో జగన్‌కు తెలుసు. కూటమి ప్రభుత్వానిది కట్టుడు వ్యవహారం, వైసీపీది కూల్చుడు వ్యవహారం. అవాకులు-చవాకులు పేల్చితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. అభివ ృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. ఒక సమ్మిట్ ఎలా నిర్వహించాలి, పెట్టుబడిదారులను ఎలా ఆకర్షించాలి, ఎన్ని రోజుల్లో గ్రౌండ్ చేయాలి, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలి అన్న అవగాహన లేని వైసీపీ నాయకులు మాట్లాడడంలో అర్థం లేదని హితవుపలికారు.
















