- వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు
- మంత్రి నారా లోకేష్ వెల్లడి
అమరావతి (చైతన్యరథం): ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇప్పటివరకు నెలలో మూడో శనివారం మాత్రమే ఉన్న ‘నో బ్యాగ్ డే’ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం అమలు చేస్తామన్నారు. ఆ రోజున పిల్లలు బడులకు బ్యాగులు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఆ రోజు తరగతులకు బదులుగా ఇతరత్రా పోటీలు.. క్విజ్‌లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, క్రీడలు, వివిధ పోటీలు నిర్వహిస్తారు. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ 2025-26 అకడమిక్ క్యాలెండర్ రూపొందిస్తోంది.