- వైసీపీ అభ్యర్థుల దుర్మార్గాలకు చెక్ పెడదాం
- ఎన్డీయే గెలుపుతోనే రాష్ట్రానికి ప్రగతి
- మీ భవిష్యత్‌కు నాది గ్యారెంటీ
- రైతు కూలీలు, కౌలు రైతులకు కార్పొరేషన్
- ప్రజాగళం సభలో చంద్రబాబు ఉద్ఘాటన
కొవ్వూరు (చైతన్య రథం): మన గెలుపు ఖాయమని ప్రజాగళం సభలకు పోటెత్తుతున్న జనాన్ని చూసి చెప్పొచ్చని చంద్రబాబు ఉత్సాహంగా ప్రకటించారు. జగన్‌రెడ్డి సభలకు 1500వందల బస్సులు పెట్టి డబ్బు లిచ్చి జనాల్ని తరలిస్తున్నా.. సభ ప్రారంభానికి ముందే జనం పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. కానీ, ఇక్కడ మీ ఉత్సాహం చూస్తుంటే మే 13 ఎప్పుడు వస్తుందా? జగన్‌రెడ్డిని, అతని పార్టీని బంగాళాఖాతం లో ఎప్పుడు కలిపేస్తామా? అని ఆకలితో ఎదురు చూస్తున్నట్టుంద న్నారు. కొవ్వూరు తెలుగుదేశంపార్టీకి అడ్డా. కొవ్వూరు లో నాటి తెలుగుదేశం పార్టీ ఊపు, కసి, సైకిల్‌ను గెలి పించాలనే సంకల్పం కనిపిస్తోంది. దారిలో ఆడబిడ్డల అభిమానం, చిన్నారుల ఉత్సాహం చూశాను. తెలుగు దేశం పార్టీ కండువా మెడలో వేసుకుని తల్లి భుజాలపై ఎక్కి తమ భవిష్యత్తు కోసం తెలుగుదేశంపార్టీ రావాలని ఆకాంక్షిస్తున్నారు అని చంద్రబాబు ఉద్వేగంగా ప్రకటిం చారు. రాష్ట్రంలో రాజకీయ గాలి తెలుగుదేశం వైపు వీస్తోంది. జనంలో ట్రెండు మారింది. జగన్‌రెడ్డి బెండు తీయడం ఖాయం. తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలనే ప్రజా నిర్ణయం ఫిక్స్ అయిపోయిందన్నారు. జగన్‌రెడ్డీ.. మనిషికి అహంకారం పనికిరాదు. అహంకారంతో విధ్వంస పాలకుడుగా మారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు. ప్రజల భవిష్యత్ అంధకారం చేశావు.
మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎడారవుతుందని ప్రజా నీకం భయపడుతుంది. అందుకే `నీ మెడలు వంచడా నికి కూటమిగా వస్తున్నాం అంటూ చంద్రబాబు హెచ్చ రించారు. జన సైనికులు హుషారుగా ఉండాలన్నారు. ప్రజల కోసం వచ్చిన వ్యక్తి పవన్ కల్యాణ్. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే జతకట్టారు. ఆయన సంకల్పాన్ని కొవ్వూరు సభా వేదిక నుంచి అభినందిస్తున్నా. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవ డం, ప్రజల్ని గెలిపించడం కోసం బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి వస్తున్నాయి. పార్లమెంటు బీజేపీ అభ్యర్ధి గా పురందేశ్వరి పోటీ చేస్తున్నారు. ఇద్దరు జనసేన అభ్యర్థులూ ఈ పార్లమెంట్‌లో పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
కొవ్వూరు ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, హోంమంత్రి చేస్తున్న ఇసుక దోపిడీకి పేదలు బలైపోయారని చంద్ర బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళ్లపూడి నుండి విజ్జే శ్వరం వరకు డ్రెడ్జింగ్‌ద్వారా ఇసుక తోడేశారు. గామన్ బ్రిడ్జి కుంగిపోయింది. హోంమంత్రిగా అధికారాలు లేకపోయినా.. దోపిడీకి అడ్డూ అదుపూ లేదు. అత్యా చారాలు ప్రశ్నిస్తే..ఇలాంటివి సాధారణమేనని మాట్లాడే మహానుభావురాలు ఆమె. మట్టి, ఎర్రమట్టి దోచుకున్నా రు. సెంటు పట్టా కోసం అరకొర చెల్లించి సేకరించిన భూముల్ని ఎకరా రూ.75లక్షలకు అమ్ముకున్నారు. దొమ్మేరు గ్రామానికి చెందిన ఎస్సీ యువకుడిపై తప్పు డు కేసు పెట్టి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పిం చారు. ప్రజలంతా తిరుగుబాటు చేస్తే.. ఇక్కడి నుండి పారిపోయి గోపాలపురంలో వాలింది. ఇక్కడ చెత్త అక్కడ బంగారమవుతుందా? దోపిడీలన్నీ తెలిసిపోవ డంతో ఓటమి తధ్యమని ట్రాన్స్‌ఫర్ చేశారంటూ చంద్రబాబు దుమ్మెత్తిపోశారు.
కొవ్వూరు నియోజకవర్గం నుండి పోటీలో ఉన్న వెంకటేశ్వరరావు సౌమ్యుడని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అన్నారు. నియోజకవర్గా నికి ఏంకావాలన్నా అందిస్తాను. బీజేపీ పార్లమెంట్ అభ్యర్ధిగా పురందేశ్వరి నిలబడుతున్నారు. ఒక ఓటు సైకిల్ గుర్తుపై.. మరో ఓటు కమలం గుర్తుపై నొక్కి రాష్ట్రాభివృద్ధికి పునాదులు వేసుకోవాలని పిలుపునిచ్చా రు. అరాచక శక్తిని ఓడిరచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఇంటికొకరు తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు పట్టుకుని ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మీ భవిష్యత్‌కు నాది గ్యారెంటీ
జాబు కావాలంటే బాబు రావాలనేది నా బ్రాండ్. గంజాయి రావాలంటే జగన్ రావాలనేదది వారి బ్రాండ్. అధికారంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత గంజాయి, డ్రగ్స్, జే బ్రాండ్ మద్యం, ఇసుక కొరత లేకుండా చేస్తా. కరెంటుఛార్జీల పెంపు లేకుండా చేస్తా. ఆడబిడ్డ నిధిగా ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఎంతమంది ఉంటే అందరికీ అందిస్తా. ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టి మరింత సంపాదించుకు నేలా మార్గాలు చూపిస్తానని చంద్రబాబు హామీనిచ్చా రు. తల్లికి వందనం పథకంతో చదువుకునే ప్రతి బిడ్డ కూ రూ.15 వేల చొప్పున అందిస్తా. ప్రతి మహిళకూ ఏటా మూడు గ్యాస్‌సిలిండర్లు ఉచితంగా ఇస్తా. రాష్ట్రం లో ఎక్కడైనా ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణించేలా చేసే బాధ్యత నాది. చంద్రన్నే మీ డ్రైవర్. సేఫ్ డ్రైవ్‌తో ప్రతి ఆడ బిడ్డనూ అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత నాది. బిడ్డల ఎదుగుదలే తల్లిదండ్రులకు సంతోషాన్ని స్తుంది. అందుకే వారిని పైకి తీసుకొచ్చే లక్ష్యంతో యువగళం పేరుతో నిరుద్యోగ భృతి ఇస్తా. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా. మెగా డీఎస్సీతో ఉపాధ్యాయ భర్తీ చేస్తా. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తానని చంద్రబాబు హామీలిచ్చారు.
రైతు కూలీలు, కౌలు రైతులకు కార్పొరేషన్
ప్రపంచవ్యాప్తంగా ఉండే కంపెనీలు ఏపీకి తీసుకొస్తా. వర్క్ ఫ్రం హోం సదుపాయాలు కల్పిస్తా. అవసరమైతే మండల కేంద్రాల్లో కామన్ వర్క్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తా. వరదల్లో నష్టపోయినా ప్రభుత్వం ఆదుకున్న పరిస్థితి లేదు. గోనె సంచులు కూడా ఇవ్వకుండా వేధించాడు. గిట్టుబాటు ధరలు లేకపోగా ఎదురు డబ్బులు ఇచ్చి పంట అమ్ముకునే పరిస్థితి కల్పించాడు. ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఇస్తా. జగన్ రెడ్డి రద్దు చేసిన ప్రతి సబ్సిడీని పునరుద్దరించి రైతును రాజుగా చేసి చూపిస్తాను. రైతు కూలీలు, కౌలు రైతుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి అండగా నిలుస్తానన్నారు. ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తా. పేదల్ని ఆర్ధికంగా స్థిరపడేలా చేసే బాధ్యత నేను తీసుకుంటా. జగన్ రెడ్డి అప్పు చేసి రూ.10 ఇస్తే.. నేను సంపద సృష్టించి రూ.15 ఇస్తా. దాన్ని రెట్టింపు చేసుకకునే మార్గాలు చూపిస్తాను. అధికారం లోకి రాగానే ప్రతి ఒక్కరికీ 2 సెంట్లు భూమి ఇచ్చి ఇళ్లు కట్టిస్తా. ఇప్పుడున్న స్థలాల్లో ఇళ్లు కట్టించి తీరుతా. టిడ్కో ఇళ్లు అందరికీ పంచుతా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీలందరికీ అండగా నిలుస్తానని చంద్రబాబు హామీలిచ్చారు.