- రాష్ట్రంలో ప్రజలు స్వేచ్చగా జీవించే పరిస్థితులు లేవు
- ప్రజల తరపున పోరాడతాం, నిలదీస్తాం.
- మెడలు వంచుతాం: చంద్రబాబునాయుడు
- ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం మా తక్షణ కర్తవ్యం
- ఇందుకోసం ఎన్నిసార్లయినా కలుస్తాం: పవన్ కళ్యాణ్
విజయవాడ :రాష్ట్రంలో ప్రజలు స్వేచ్చగా జీవించే పరిస్థితులు లేవు.. రాజకీయ పార్టీలుగా ప్రజలతరపున పోరాడ తాం, నిలదీస్తాం, ప్రభుత్వం మెడలు వంచుతామని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు సింహగర్జన చేశారు. విజయవాడ నోవా టెల్‌లో పవన్ కళ్యాణ్‌కు సంఫీుభావం తెలిపిన అనంతరం హోటల్ వెలుపల చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లా డుతూ.. 40సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. ఒక రాజకీయపార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ విశాఖ పట్నం వెళ్తే దారుణంగా ప్రవర్తించారు. ఆయనను తిరగనీయకుండా చేయడం కోసం దాడులు చేయడ మేగాక, కేసులు బనాయించారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్లయిట్ దిగినప్పటినుంచి హోటల్‌కు పోయే వరకు వేధింపులకు గురిచేశారు. ఆయన వెళ్లే దారిలో లైట్లు ఆపేశారు. కావాలని ఒక పోలీసు ఆఫీసరు కారెక్కి..ఎక్కడికక్కడ కట్టడిచేశారు. ఉన్మాదిపాలనలో పైశాచికానందం కోసం ఇలా చేస్తున్నారు. వందలాది పోలీసులను పెట్టి రాత్రంతా హోటల్‌లో భయంకర మైన పరిస్థితులు కల్పించారు. 41ఎ నోటీసు ఇచ్చి విశాఖ నుంచి ఉన్నఫళంగా పంపారు. పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర పౌరుడుకాదా? ఆయనకు రాష్ట్రంలో స్వేచ్చ గా తిరిగే హక్కులేదా? రాష్ట్రంలో ప్రజలు స్వేచ్చగా జీవించే పరిస్థితులు లేవు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మా మనోస్థయిర్యాన్ని దెబ్బతీయడం కోసం వ్యక్తిత్వ హన నానికి పాల్పడుతున్నారు. అదేమని ప్రశ్నిస్తే ఎదురు కేసులు పెట్టి జైలులో పెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేస్తున్నారు. వైసిపి సైకో ప్రభుత్వ వేధింపులు తాళలేక చాలామంది ఆత్మహత్యలు చేసు కునే పరిస్థితి నెలకొంది.
వైసిపి లాంటి నీచమైన పార్టీని జీవితంలో చూడలేదు
పవన్ కళ్యాణ్‌కు సంఫీుభావాన్ని తెలియజేసేందు కు ఇక్కడకు వచ్చా. నా రాజకీయ జీవితంలో చాలా రాజకీయ పార్టీలు చూశా. ఇంతమైన నీచమైన, దారు ణమైన పార్టీని జీవితంలో చూడలేదు. మా ఆఫీసుపై దాడి జరిగి ఏడాదైనా ఇప్పటివరకు బాధ్యులపై కేసు పెట్టలేదు. పైగా మావారిపై తిరిగి మావాళ్లపైనే కేసు పెట్టే పరిస్థితికి వచ్చారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వా మ్యం ఉందా? ముందు రాజకీయ పార్టీల మనగుడ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ఓట్లు ఎవరికి వేయాలో తర్వాత ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. విశాఖలో పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టడం తప్పా? ముఖ్యమంత్రి మమ్మల్ని తిట్టించి పైశాచికానందం పొందుతున్నారు. ఆ ఆనందం శాశ్వతం కాదు.
అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతా
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతా. ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే మాఉమ్మడి లక్ష్యం. పోలీసువ్యవస్థకు విజ్జ ప్తి చేస్తున్నా.కొంతమంది పోలీసులు దారుణంగా ప్రవ ర్తిస్తున్నారు. మేం బయటకువస్తే ఆంక్షలు, నిర్బంధా లు విధిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. పద్ధతి మార్చుకోకపోతే మిమ్మల్ని కూడా వదిలి పెట్టను.అన్నిరాజకీయ పార్టీలు,ప్రజాసంఘాలు, విద్యా ర్థి సంఘాలకు పిలుపు నిస్తున్నా. ముందుగా ప్రజా స్వామ్యాన్ని కాపాడుకుందాం.. ముందుకు రండి. రాజకీయ పార్టీలుగా ముందు మనుగడ సాగిస్తే ఎలా పోటీ చేయాలో తర్వాత నిర్ణయించుకుందాం. మీడి యాకు కూడా విజ్జప్తి చేస్తున్నా. భయంకరమైన సైకో పాలనలో మీరుకూడా భయభ్రాంతులయ్యారు.విజయ వాడలో జర్నలిస్టు అంకబాబు పోస్టు పెడితే అర్థరాత్రి అరెస్టు చేస్తారా? నేనే ముందుకు వచ్చి ఆయన తర పున మా వాళ్లను పంపించా.
రాష్ట్రంలో ఎవరికైనా రక్షణ ఉందా?
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాము ఉమ్మడి పోరాటం కొనసాగిస్తాం. ఈరోజు మీడియా కూడా బయటకు వచ్చి స్వేచ్చగా మాట్లాడే అవకాశం లేదు. సామాన్యుడు రేషన్ కావాలన్నా,పట్టాకావాలన్నా అడిగే పరిస్థితి లేదు. ఎవరైనా ఆస్తి కబ్జా చేసినా పోలీసు స్టేషన్‌లో రిపోర్టుచేసే పరిస్థితులు లేవు. రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా? తమ ఆవేదన చెప్పుకునే ధైర్యం ఉందా? ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల కర్త వ్యం ప్రజాస్వామ్య పరిరక్షణ. ఈ లక్ష్యసాధనకు అంద రూ కలసిరావాలి. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు ంౖతుల వద్దకు వెళ్లి ఆర్థిక సాయం చేసే స్వేచ్చ పవన్ కు లేదా? ప్రభుత్వం తరపున సాయం అందడంలో ఫెయిలైనపుడు మేం సొంత నిధులుసాయం చేయడా నికి వెళ్తే అడ్డుకుంటున్నారు. నా విషయంలో కూడా అదే జరిగింది. నేను విశాఖ వెళితే తిరిగి టపాలో వెనక్కి పంపారు. గతంలో తిరుపతి ఎయిర్ పోర్టు నుంచి కూడా అలాగే పంపారు. పవన్ పై దాడి జరిగిందని మీరంతా మిన్నకుండా కూర్చుంటే రేపు మీపై కూడా దాడి జరగొచ్చు. సుదీర్ఘ రాజకీయ చరి త్రలో చాలా పార్టీలు చూశాం. అసెంబ్లీలో ఒకే ఒక ఎమ్మెల్యే ఓంకార్‌ను చూశా. ఆయన మాపై చాలా విమర్శలు చేసేవాడు. ఎప్పుడు కూడా ఆయ నను అవమానించలేదు. ఆయనను అవమానిస్తే ప్రజ లను అవమానించిన ట్లుగానే భావించా.
తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలయికపై వైసిపి సైకో బ్యాచ్‌లో కలవరం మొదలైంది. ఎటువంటి సం కేతాలు లేకుండా మంగళవారం మధ్యాహ్నం ఆకస్మి కంగా ఇరుపార్టీల అధినేతలు కలవడంతో ఏం జరగ బోతోందని యావత్ రాష్ట్రప్రజలు ఆతృతగా ఎదురు చూశారు. విజయవాడ నోవా టెల్ హోటల్‌లో అధి నేతలిద్దరూ సుమారు గంటకు పైగా రాష్ట్రంలో వైసిపి అరాచక పాలన, తాజాగా నెలకొన్న పరిణామాలపై చర్చించారు. చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ పై వైసిపి సైకో బ్యాచ్ బూతులు లంకించుకొని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ నైతిక స్థయిర్యాన్ని దెబ్బ తీస్తున్న తీరును ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చిం చారు. ఈ పరిస్థితుల్లో ముందుగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు ఉమ్మడి పోరాటం అవసరమని ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇదే సమయంలో కలసివచ్చే ఇతర రాజకీయపక్షాలను కూడా కలుపుకొని అధికారపార్టీ నియంతృత్వ పోక డపై పోరాటం కొనసాగించాలని నిర్ణయించుకున్నా రు. రాష్ట్రంలో వారు,వీరనే తేడాలేకుండా అధికార పార్టీ అకృత్యాలను ప్రశ్నించే వారిపై వైసిపి సైకో బ్యాచ్ ఎదురుదాడికి దిగుతున్న తీరును ఇద్దరు నేతలు గుర్తించారు. విశాఖలో జరిగిన చిన్న సంఘటనను ఆధారంగా చేసుకొని పవన్ కళ్యాణ్ పై వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యక్తిత్వ హనానికి పాల్పడుతూ గత రెండురోజులుగా వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండిస్తూ సమస్యలనుంచి పక్కదారి పట్టించేందుకు గత మూడున్నరేళ్లుగా వైసిపి చేసే ఇటువంటి చీప్ ట్రిక్కులనే తమపై కూడా ప్రయోగించిందని చంద్రబాబునాయుడు పవన్ కు తెలిపారు. వైసిపి సైకో బ్యాచ్ అరాచకాలను ఇకపై ఉమ్మడిగా దీటుగా ఎదుర్కోవాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందుకోసం రాబోయే రోజుల్లో ఎన్నిసార్లయినా కలవాలని అధినేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇదిలావుండగా అధినేతల కలయికపై తాడేపల్లి ప్యాలెస్ లో కలకలం చెలరేగింది. అందుబాటులో ఉన్న నేతలతో ముఖ్యమంత్రి జగన్ మంగళవారం రాత్రి రహస్యంగా సమావేశమయ్యారు. వైసిపి మంత్రుల ఓవరాక్షన్, నోటిదూల వ్యాఖ్యలే ఇద్దరు నేతల కలిసేలా చేశాయని ఒక సీనియర్ నేత సిఎం వద్ద వాపోయినట్లు తెలిసింది. అయితే సంబంధిత మంత్రులను ఉసిగొల్పింది తానే కావడంతో ముఖ్యమంత్రి తేలుకుట్టిన దొంగలా ఉండపోయినట్లు సమాచారం. మొత్తమ్మీద తాజా రాజకీయ పరిణామాలు వైసిపి సైకో బ్యాచ్ ని తీవ్ర అలజడికి గురిచేశాయి. చేసిన తప్పులకు ఇప్పటికైనా బుద్దితెచ్చుకొని ప్రజాసమస్యలపై సృష్టిస్తారో, ప్రతిపక్షనేతలపై ఎదురుదాడిని మరింతగా పెంచి ప్రజలతో ఛీకొట్టించుకుంటారో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.