- సజ్జలకు సాంబార్ అన్నం మీద ఉన్న శ్రద్ధ సబ్జెక్ట్ పై ఉండదు
- జగన్‌కి పిచ్చి ముదిరి చంద్రబాబుపై రోజుకొక అక్రమ కేసు పెడుతున్నాడు
- దళిత మహిళానేతపై అక్రమ కేసు పెట్టడం ఏ రకమైన సామాజిక న్యాయం?
- ఎన్నికల్లో నిజాయితీగా గెలిచే సత్తా లేకనే జగన్ రెడ్డి కుట్ర రాజకీయాలు
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సాంబార్ అన్నం మీద ఉన్న శ్రద్ధ సబ్జె క్ట్‌పై ఉండదు.. తానే అపర మేధావినన్నట్టు అడ్డగోలు గా మాట్లాడటం తప్ప ఆయన మాటల్లో అసలు విష యం ఉండదని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కేఎస్ జవహర్ అన్నారు. జగన్‌కి ఉన్న పిచ్చి ముదిరి చంద్రబాబుపై రోజుకొక అక్రమ కేసు పెడుతున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో జవహర్ విమర్శించారు. ఇసుకలో రూ.40 వేల కోట్లు దోపిడీ చేసిన జగన్‌రెడ్డి చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టడం సిగ్గుచేటు. సామా జిక న్యాయం అంటూ చంకలు గుద్దుకుంటూ..దళిత మహిళా నేతపై అక్రమ కేసు పెట్టడం ఏ సామాజిక న్యాయం? ఉచిత ఇసుక రద్దు చేసి, 40 లక్షల మంది కార్మికుల్ని రోడ్డున పడేసి 160 మంది భవన నిర్మాణ కార్మికుల్ని బలిగొన్న దుర్మార్గుడు జగన్ రెడ్డి. ఇసుకను మీరు దోచేసి ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టటం సిగ్గనింపించటం లేదా? బడుగు, బలహీన వర్గాలకు ఉచితంగా ఇసుక ఇవ్వటమే చంద్రబాబు చేసిన తప్పా?
టీడీపీ హయాంలో ఏపీఎండీసీని నోడల్ ఏజెన్సీగా నియమించి, దానిద్వారా మహిళా సమాఖ్యలకు ఇసుక రీచ్ లు అప్పగించాలని.. తద్వారా వచ్చే లాభాలలో 25శాతం ఆదాయం మహిళా సంఘాలకు దక్కేలా చేయాలని ఆదేశిస్తూ జీవో – 94 ఇచ్చాం. ఈ డ్వాక్రా మహిళలలో అధిక శాతం బడుగు, బలహీన వర్గాలే. ఆ వర్గాలు ఆర్థికంగా అభివృద్ది చెందటం ఇష్టం లేకనే.. నాడు జగన్, వైసీపీ నేతలు ఇసుక లో అవినీతి అంటూ తప్పడు ప్రచారం చేశారు. వైసీపీ పదేపదే పనిగట్టుకొని మరీ ఇసుక తవ్వకాలపై నిరాధార ఆరోపణలు చేస్తుం డటంతో పాలసీ మార్చి ప్రజలకు ఉచితంగా ఇసుక అందించాం. ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు. చంద్రబాబునాయుడి హయాంలో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ జరిమానా విధించిందని వైసీపీ చెబుతోంది. కానీ ఎన్జీటీ తుదితీర్పులో తాము గతంలో నియమిం చిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికతో పూర్తిగా సం తృప్తి చెందామని, ఇంకా అదనంగా ఎలాంటి నివేది కలు ఇవ్వాల్సిన పనిలేదని అభిప్రాయ పడిరది. నిపుణు ల కమిటీ చాలా స్పష్టంగా ఇసుక తవ్వకాల వల్ల పర్యా వరణానికి ఎటువంటి నష్టం జరగలేదని పేర్కోంది. ఈ విషయాన్ని వైసీపీ నేతలు ఎందుకు చెప్పటం లేదు? వచ్చే ఎన్నికల్లో నిజాయితీగా గెలిచే సత్తా లేకనే జగన్ రెడ్డి కుట్ర రాజకీయాలకు తెరలేపారు. ఈ కుట్ర రాజకీయాల్ని ప్రజలు చిత్తు చేసి వైసీపీని చిత్తు చిత్తుగా ఓడిరచటం ఖాయమని జవహర్ స్పష్టం చేశారు.