- మహాపాదయాత్ర ఉత్తరాంధ్రపై దాడి అంటే ప్రజలు నమ్మరు
- వైసీపీకి చేతనైన విద్య విధ్వేషాలు రెచ్చగొట్టడమే
- ఉత్తరాంధ్రలో దందాలు చేస్తున్న జగన్ అనుయాయులు
అమరావతి: వైసీపీకి చేతనైన ఒకే ఒక విద్య ప్రజ ల్లో కుల, మత, ప్రాంతీయ విధ్వషాలు రెచ్చగొట్టడ మేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. బ్రిటీష్ వారి తరువాత విభజించి పాలించు అనే తత్వాన్ని బాగా వంట బట్టించుకున్న వ్యక్తి జగన్ అని సోమవారం ఆయన ట్వీట్ చేశారు. మూడేళ్ళ క్రితం అధికారంలోకి వచ్చిన కొత్తలో మూడు రాజధానులని ఊగారని, మళ్ళీ సౌండ్ లేదని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులలో కూడా ఏ ఒక్క చోటా ఒక్క ఇటుక కూడా వేసింది లేదన్నారు. ఇప్పుడు అమరావతి ప్రాంత రైతులు ఉత్తరాంధ్ర వెళుతున్నారని, ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రజలలో ఒక చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మూడేళ్ళ లో ఈ అసమర్థులు మన ప్రాంతానికి చేసింది ఏముందన్న ప్రశ్న వారిలో తలెత్తుతుందన్నారు. అందుకే వైసీ పీ నేతల్లో ఈ కలవరపాటు, ఆక్రోశం,అడ్డంకులు అని తెలిపారు. దండయాత్ర అంటూ ఏడుపులు మొదలు పెట్టారన్నారు. వైసీపీ వారికి, జగన్‌రెడ్డికి నిజంగా దమ్ముంటే ఈ మూడు సంవత్సరాలల్లో ఉత్తరాంధ్ర కోసం చేసిన అభివృద్ధిని చెప్పాలని సవాల్ విసిరారు. ఉన్నట్లుండి ఉత్తరాం ధ్ర కోసం మొసలి కన్నీళ్ళు కార్చుతున్న ఉత్తరాంధ్ర మంత్రులు నిజంగా ప్రశ్నించాల్సి నది జగన్‌ను అని తెలిపారు.
మూడేళ్ళుగా వందలాది జగన్ అనుయాయులు రాయలసీమ ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్రకు వచ్చి హోటళ్ళు, లాడ్జిలు, గెస్ట్ హౌస్‌ల్లో తిష్ట వేసి భూ కబ్జాలు, భూ దందాలు, సెటిల్మెంట్‌లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర పై వారంతా మూడేళ్లుగా ఎందుకు దండయాత్ర చేస్తున్నారు అని ప్రశ్నిం చారు. కొద్ది మంది రైతులు, నాలుగు రోజులు పాద యాత్ర చేసి దైవ దర్శనం చేసుకోవడాన్ని దండయాత్ర అంటున్న మంత్రులు నిజంగా తమకు ఆత్మాభిమానం, ఆత్మ సాక్షి ఉంటే తమని తాము ప్రశ్నించుకోవాలని సలహా ఇచ్చారు. మూడేళ్ళుగా ఇక్కడ ఏ2 విజయ సాయిరెడ్డి వెలగ బెట్టిన కార్యం ఏమిటని అడిగారు. అతడికి, అతడి బంధువులకు, జగన్‌రెడ్డి ఇక్కడ తిష్ట వేయించిన ఇతర రాబందులు అందరికీ ఉత్తరాంధ్రలో ఏమి పని అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర వైసీపీలో ఉన్న మంత్రులు, నాయకులు అందరూ అసమర్థులా? ఒక్కరూ సమర్థుడు కూడా లేడని జగన్ అభిప్రాయమా? అందుకే ఇక్కడ విజయసాయి రెడ్డిని సామంత రాజుగా నియమనించాడని అన్నారు. విశాఖ మణిహారం రుషికొండను కూడా గుల్ల గుల్ల చేస్తూ ఉంటే ఒక్క వైసీపీ నాయకుడికి కూడా బాధ కలగలేదన్నారు. ఒక్కరైనా ఇది తప్పు అని తమ అసంతృప్తిని వెలిబుచ్చ లేకపోతున్నారని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ను ప్రైవేట్ పరం చేస్తారని ఉద్యోగులు, విపక్షాలు నిర సనలు తెలుపుతూ ఉంటే.. విశాఖ ఉక్కుకు చెందిన 7500 ఎకరాలు తెగనమ్మితే సరిపోతుందని ఈ ముఖ్యమంత్రి అన్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో ప్రభుత్వ భూములు అమ్మడం, తనాఖాలు పెట్టడం తప్ప ఏమి ఒరగబెట్టిందిలేదన్నారు.
మహాపాదయాత్రను ఉత్తరాంధ్రపై దాడి అంటే ప్రజలు నమ్మరు
రాష్ట్ర ప్రజలు కూడా ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి అమరావతి మహా యాత్రను ఉత్తరాంధ్రపై దండయాత్ర అంటే ప్రజలు ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని, దానికి తగినట్లుగానే 20 సంవత్సరాల ప్రణాళిక, ముందు చూపుతో చంద్రబాబు నాయుడు ప్రతి ప్రాంతం అభివృద్ధికి బాటలు వేశారని వివరించారు. ఉత్తరాంధ్ర ప్రజలైనా, రాష్ట్రంలో ఏ ప్రాంత ప్రజలయినా శాంతిని, సౌభ్రాతృ త్వాన్ని, సామరస్యాన్ని కోరుకుంటారని పేర్కొన్నారు.