- ప్రజల కోసమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి
- నిధుల దుర్వినియోగం కారకులను వదిలేదు లేదు
- టీడీఆర్ బాండ్లలో అవినీతిపై విచారణ నివేదిక వచ్చింది
- సీఎం నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం
- పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ
- నెల్లూరు కలెక్టరేట్లో ప్రజల నుంచి అర్జీల స్వీకరణ
నెల్లూరు(చైతన్యరథం): ప్రజల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా సమస్యల పరిష్కార వేదిక తీసుకువచ్చారని, అర్జీలు తీసుకోవడమే కాదని స్పాట్లోనే పరిష్కారం చూపుతున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, కమిషనర్ సూర్య తేజలతో కలిసి నారాయణ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పలువురు బాధితులు సమస్యను పరిష్కరించాలంటూ మొర పెట్టుకున్నారు. స్పందించిన మంత్రి కొన్ని అర్జీలను స్పాట్లోనే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మరి కొన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి విచారించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు నిర్వహించిన ప్రజా సమ స్యల పరిష్కార వేదికలో సుమారు 50 మంది వరకు అర్జీలు ప్రజలు అందచేశారని..కొన్నిం టిని స్పాట్లోనే పరిష్కరించడం జరిగిందని తెలిపారు. కొన్నింటిని కేబినెట్ స్థాయిలో పరి ష్కరించాల్సి ఉందని, వాటిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిం చేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. కొన్ని రెవెన్యూ సమస్యలు, టౌన్ ప్లానింగ్ శాఖలో మరికొన్ని సమస్యలు వచ్చాయని..కమిషనర్ సూర్యతేజ స్పాట్లోనే పరిష్కరించేందుకు చర్య లు చేపడుతున్నారని తెలిపారు. పోలీసు డిపార్ట్మెంట్కు సంబంధించి ఒక కేసు వచ్చిందని …దానిని కూడా ఎస్పీ బాధితులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారని వివరిం చారు. ఉదాహరణకు బుచ్చిరెడ్డిపాళెంలో ప్రభుత్వ పార్కు స్థలంలో ఓ వ్యక్తి ఇటుక బట్టీలు పెట్టుకున్నారని, అధికారులను వివరాలు సేకరించాలని ఆదేశించడం జరిగిందన్నారు.
టీడీఆర్ బాండ్లపై విచారణ నివేదిక వచ్చింది
టిడ్కో ఇళ్లపై ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించారని..వాటిని సందర్శించాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేశారని వివరించారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన వారిని ఎట్టి పరిస్థితిలో వదిలేదని లేదని తనదైన శైలిలో హెచ్చరిం చారు. తణుకులో టీడీఆర్ బాండ్లలో సుమారు రూ.700 కోట్లు దుర్వినియోగానికి పాల్ప డ్డారని, విచారణ నివేదిక వచ్చిందని దానిని సీఎంకు పంపించడం జరిగిందని చెప్పారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో అవినీతిపై పూర్తిస్థాయిలో విచారించి న్యాయపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.