అమరావతి (చైతన్యరథం): పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోందని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇచ్చిన హామీల్లో కేవలం 13 శాతం మాత్రమే అమలు చేసి ప్రజలకు పంగనామాలు పెట్టిన జగన్కు హామీల అమల్లో చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. జగన్ను రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు.. ఆయన పార్టీ నేతలు కూడా వద్దనుకుంటున్నారని, భరించలేకపోతున్నారని చెప్పారు. అందుకే పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లో చేరుతున్నారని చెప్పారు. ఈ కారణంగానే విశాఖ కార్పొరేషన్ స్టాండిరగ్ కౌన్సిల్ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయిందన్నారు. అంతేకాదు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీకి ఓటమి ఖాయమని అన్నారు. వరుసగా అన్ని ఎన్నికల్లో ఓడిపోతున్నా జగన్కు తత్వం బోధపడడం లేదని, ఓటమి నుండి పాఠాలు నేర్చుకోలేదని ధ్వజమెత్తారు. ఓటమిని జీర్ణించుకోలేని జగన్ రెడ్డి అధికారం కోల్పొయి కొద్ది రోజులు కూడా కాకముందే అప్పుడే తాను మళ్లీ సీఎం కుర్చీపైన కూర్చుంటానంటూ పగటి కలలు కంటున్నారని అనగాని విమర్శించారు.
జగన్ మానసిక స్థితి బాగోలేదని ఆయన చెల్లెలు చెప్పింది నిజమే అనిపించేట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకే అన్ని వ్యవస్థలూ విఫలమయ్యాయంటూ జగన్ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ పాలన చేసిన గాయాల నుండి ప్రజల ఇంకా కోలుకోలేదని, 11 సీట్ల మాత్రమే ఇచ్చి ఆ పార్టీని అధ:పాతాళానికి తొక్కిన ప్రజలు.. జగన్ పై ఇంకా కోపంగానే ఉన్నారని, ఆ విషయాన్ని గుర్తించని జగన్ అలవాటు ప్రకారం అబద్ధాలు వల్లె వేస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నిజంగా జగన్ ప్రజలకు బిర్యానీనే పెట్టి ఉంటే ఎన్నికల్లో ప్రజలెందుకు దారుణంగా ఓడిరచారని ప్రశ్నించారు. ప్రజలను తక్కువ అంచనా వేయడం మంచి కాదని జగన్ గ్రహించాలని, ఎవరినైనా ఒక్కసారే మోసం చేయగలమని, ఎల్లవేళలా కాదని జగన్ తెలుసుకోవాలని హితవు చెప్పారు. గత ప్రభుత్వంలో ఆకలి మంటలతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు జగన్ మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.