అమరావతి: ఏపీ సీఐడీ అధికారులు ఇచ్చిన 41ఏ నోటీసుపై చింత కాయల విజయ్ సీఐడీకి లేఖ రాశారు. ఈ లేఖను అందించేందుకు సీఐడీ కార్యాలయానికి వెళ్లిన విజయ్ తరఫు న్యాయవాదులు దాదాపు 4గంటల పాటు కార్యాలయంలోనే వేచి ఉన్నా సిఐడి అధికారులు వారిని కలవలేదు. అధికారులు లేఖ తీసుకోకపోవడంతో తపాల్లో ఇచ్చి వెళ్లారు. విజయ్‌కు ఏపీ సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులు చెల్లవని ఈ సందర్భంగా న్యాయవాదులు స్పష్టం చేశారు. ఆ నోటీసులో ఎలాం టి వివరాలు లేవని పేర్కొన్నారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ, క్రిమినల్ కేసుల వివరాలు తెలపాలని విజయ్ లేఖలో కోరారు. తన నివాసంలోకి అక్రమం గా సీఐడీ పోలీసులు చొరబడ్డారని ఆరోపించారు. తన కుమార్తెను బెదిరించారని, డ్రైవర్‌ను కొట్టారని, తన పిల్లల్ని సంరంక్షించే వారిపట్ల దురుసుగా ప్రవర్తించా రని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయ్‌కు కానీ, అతని కుటుంబ సభ్యులకుకానీ 41ఏ నోటీసులు ఇవ్వాలని.. ఇంట్లో పని మనుషులకు నోటీసు అందజేస్తే అది చెల్లదని ఆయన తరఫు న్యాయవాది కోటేశ్వరరావు తెలిపారు. కేసుకు సంబం ధించిన వివరాలేవీ నోటీసులో పొందుపర్చ లేదని, కేవలం విజయ్.. అతని కుటుంబ సభ్యులను భయ పెట్టేందుకే నోటీసులు ఇచ్చినట్టు కనిపిస్తోం దన్నారు. విజయ్ తరఫున న్యాయవాదులుగా తాము సీఐడీ కార్యాలయానికి వెళితే పోలీసులు పట్టించుకో లేద న్నారు.నాలుగుగంటల పాటు కార్యాలయంలోనే వేచి చూసినా అపాయింట్మెంట్ ఇవ్వలేదని,చేసేదిలేక విజయ్ రాసిన లేఖను సీఐడీ కార్యాలయంలోని తప్పా ల్లో ఇచ్చి వెనుదిరిగామని కోటేశ్వరరావు తెలిపారు.