- సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో ముమ్మూటికీ అవినీతి
- సెక్ నివేదికలో ఏపీ చీఫ్ మినిస్టర్ అని స్పష్టంగా ఉంటే..
- పేరు లేదని జగన్‌రెడ్డి విచిత్రంగా మాట్లాడుతున్నారు
- 2014 ధరలతో పోల్చుకుని మాట్లాడటం విడ్డూరం
- అప్పట్లో ఒక మెగావాట్‌కు ప్యానళ్ల ఖర్చు రూ.15 కోట్లు..
- ఇప్పుడు అవే ప్యానళ్ల ఖర్చు రూ.50 లక్షలు మాత్రమే
- ఈ కేసులో ఆయన ఫలితం అనుభవించక తప్పదు
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి
అమరావతి(చైతన్యరథం): సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కోసం జగన్మోహ న్‌రెడ్డి లంచం తీసుకున్నారని ఎఫ్‌బీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.. అడ్డంగా బుక్ అయి ఇప్పుడు బుకాయిస్తామంటే కుదరదు..సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో ఆయన ముమ్మాటికీ అవినీతికి పాల్పడ్డారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో యూనిట్ రూ.5కి కోనుగోలు చేస్తే తాను రూ.2.49 కొనుగోలు చేశామని జగన్‌రెడ్డి చెబుతున్నారు. 2014లో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన సోలార్ ప్యాన ల్స్, ఇతర పరికరాల కోసం రూ.15 కోట్లు ఖర్చు అయ్యేది..ఇప్పుడు అవే పరికరాలు రూ.50 లక్షలకు వచ్చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్న టెక్నాలజీతో ఇలాం టి పరికరాల ధరలు తగ్గుతున్నాయనే కనీస పరిజ్ఞానం కూడా జగన్‌రెడ్డికి లేకుండా పోయిందని మండిపడ్డారు.
2014 ధరలతో పోల్చడం హాస్యాస్పదం
1994లో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో అప్పుడప్పుడే సెల్ ఫోన్లు వస్తున్నాయి. వాకీ టాకీలా ఉండే ఫోన్‌ను నేను వాడాను. అప్పట్లో నేను అవుట్ గోయింగ్ కాల్ చేసినా, నాకు ఇన్ కమింగ్ కాల్ వచ్చినా నిమిషానికి రూ.16 పడేది. ఇప్పుడు జస్ట్ మంత్లీ చార్జెస్ చెల్లిస్తే ప్రపంచంలో ఎక్కడికైనా ఉచితంగా చేసుకునే సౌల భ్యాన్ని టెక్నాలజీ తెచ్చిపెట్టింది. టెక్నాలజీ తెచ్చిన మార్పులను జగన్మోహన్‌రెడ్డి విస్మరిం చి 2014 ధరలతో పోల్చి తక్కువని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. 2021లో గుజరా త్ యూనిట్ రూ.1.99కే సోలార్ విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. అదే సమయంలో జగన్ యూనిట్‌కు 50 పైసలు పెంచి ఒప్పందం చేసుకున్నాడు. అదానీ నుంచి రూ.1750 కోట్లు లంచంగా తీసుకునే 50 పైసలు పెంచి రూ.2.49కి ఒప్పందం కుదుర్చుకున్నారు. జగన్ అప్పట్లో గుజరాత్ కన్నా 10 పైసలో, 20 పైసలో తగ్గించి ఇప్పుడు గొప్పలు చెప్పుకుని ఉంటే బాగుండేది. 2014 ధరలకు 2021లో పోల్చుకుని తాను గొప్పని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
పేరు లేదని బుకాయింపు సిగ్గుచేటు
అదానీ తనకు లంచం ఇచ్చినట్లు ఎక్కడుందని జగన్‌రెడ్డి బుకాయించడం కూడా విచిత్రమే..అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (సెక్) దర్యాప్తు నివేదికలో ఏపీ చీఫ్ మినిస్టర్ అని స్పష్టంగా ప్రస్తావించింది. ఏపీ చీఫ్ మినిస్టర్‌ను గౌతమ్ అదానీ కలిసిన ముడుపుల విషయం మాట్లాడిన తర్వాతే సెకీతో ఒప్పందానికి ఏపీ అంగీకరిం చిందని అజూర్ ప్రతినిధులకు అదానీ గ్రూప్ సమాచారం పంపిందని సెక్ స్పష్టం చేసిం ది. 2021లో ఏపీ చీఫ్ మినిస్టర్ అంటే జగన్మోహన్‌రెడ్డి కాదా…ఈ విషయం చిన్న పిల్లలను అడిగినా చెప్పరా అని ప్రశ్నించారు. ఆయన ఏపీకి మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకునేందుకు కూడా సిగ్గుపడే పరిస్థితి వస్తోందని ధ్వజమెత్తారు. రెండు డజన్ల కేసు లతో 12 ఏళ్లుగా ఈడీ, సీబీఐలు తనను ఏం పీకలేకపోయాయనే దీమాతో ఆయన ఉన్న ట్టున్నారు. ఇప్పుడు జగన్‌రెడ్డి బుక్ అయింది అంతర్జాతీయస్థాయిలో..బుక్ చేసింది ఫెడర ల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (సెకి) ..అవి ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యం కలిగినవని మరిచిపోవద్దని హితవుపలికారు. జగన్ లంచం తీసుకున్నాడని స్పష్టంగా బయటకు వస్తే తాను కాదు..2021లో ఉన్న అప్పటి సీఎం అని చెప్పడం విచిత్రంగా ఉంది. సీఎంగా ఆయన చేసిన పాపాలతో రాష్ట్రంతో పాటు ప్రజలు నష్టపోయారు..పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలను కోల్పో యాం. రెండు డజన్ల కేసుల సంగతేమో ఈ కేసుకు సంబంధించి మాత్రం కొద్ది నెలల్లోనే ఫలితం అనుభవించక తప్పదని స్పష్టం చేశారు.