అమరావతి: తెలుగునాట సంక్షేమరాజ్యానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయు డు కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్క రించుకుని మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమా లలు వేసి నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మరణించి 28ఏళ్లు గడిచినప్పటికీ ప్రజల హృదయాల్లో నేటికీ చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది. ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అని నినదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే కాదు.. దేశానికే సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. కిలో రెండు రూపాయలకే బియ్యం, పేదలకు పక్కా ఇళ్లు, జనతా వస్త్రాల పథకం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. రైతులకు రూ.50కే హార్స్ పవర్ విద్యుత్ ఇవ్వడంతో పాటు వృద్ధాప్య పెన్షన్ ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో కొలువయ్యారు. రాజకీయాల్లో మహానాయకుడిగా, వెండితెరపై రారాజుగా వెలుగొంది తెలుగువారి ఆత్మగౌరవ కీర్తిపతాకాన్ని ప్రపంచ నలుదిశలా చాటారు. నేడు జగన్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాలు దోపిడీకి, వంచనకు గురవు తున్నాయి. రాక్షస పాలనకు చరమగీతం పాటి ఎన్టీఆర్ కలలుగన్న రామరాజ్యం స్థాపనకు ప్రతిఒక్కరం కంకణబద్ధులవుదాం. వచ్చే ఎన్నికల్లో జగన్‌రెడ్డికి తగిన బుద్ధిచెబుదామని అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు.