- గంట, అరగంట, గోరంటలపై చర్యలేవి జగన్ రెడ్డీ
- వైసిపి నేతలను చూస్తే హడలిపోతున్న మహిళలు
- కామాంధులపై చర్యల్లో జగన్ సాచివేత వైఖరి
- తప్పుడు పనులు కప్పిపుచ్చడానికే కులాల కుంపటి
- సిఎం వైఖరిపై నేడు విజయవాడలో అఖిలపక్షం
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
తన పాలనతో దేశం మొత్తం ఏపీ వైపు తిరిగేలా చేస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజున చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాటల వెనుక అంతర్యమేమిటో తాజాగా వైసిపి లోక్ సభ సభ్యుడు గోరంట్ల మాధవ్ చర్యతో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. గత మూడేళ్లుగా విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని 30ఏళ్లు వెనక్కినెట్టిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి… కొందరు కామాంధులైన వైసిపి నేతలకు కొమ్ముకాస్తూ వారికి పదోన్నతి కల్పిస్తున్నారు. అంబటి రాంబాబు ఒక మహిళతో గంటవచ్చి తనకు కావాల్సిన చేయాలని అసభ్యంగా మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యాక ఆయనపై చర్య తీసుకోకపోగా… రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా ప్రమోషన్ కల్పించారు. ఒంటిపై నూలుపోగు లేకుండా సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన గోరంట్ల మాధవ్ కు కూడా ముఖ్యమంత్రి రేపో,మాపో అదనంగా మరో కీలకపదవి అప్పగించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
తప్పుడు పనులు కప్పిపుచ్చేందుకు
కులం కార్డు బయటకు తెచ్చిన జగన్ రెడ్డి
మూడేళ్లుగా ఆడబిడ్డల రక్షణను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాధవ్ వ్యవహారంలో యావత్ ప్రపంచం ముఖాన ఉమ్మేస్తుండటంతో.. అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు కులం కార్డు బయటకు తీసి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో బాగోతం బయటపడిన వెంటనే చర్యలు తీసుకోకపోగా.. ఆయన ద్వారా ఒక సామాజికవర్గంలో విధ్వేషపూరిత వ్యాఖ్యలు చేయించి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. స్వతహాగా నేరచరితుడైన జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో ఆర్థిక నేరస్థులు, ఖూనీకోర్లు, బ్రోకర్లు, రేపిస్టులకు పెద్దపీట వేస్తున్నారు. జగన్ చేతకానితనాన్ని అలుసుగా తీసుకున్న వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళలను చెరబడుతూ అచ్చోసిన ఆంబోతుల్లా రోడ్లపై పడ్డారు. చివరకు జగన్మోహన్ రెడ్డి వద్ద మార్కులు కొట్టేయాలంటే గంట , అరగంట, గోరంట వంటి వారి మాదిరి రెచ్చిపోవాలనే పరిస్థితులు కల్పించారు.
దిగజారుడు నేతలకే వైసీపీలో అందలం
గోరంట్ల మాధవ్ పై గతంలో 376,302,506 సెక్షన్ల కింద తీవ్రమైన కేసులున్నాయని తెలిసి కూడా జగన్ రెడ్డి ఆయన ఎంపి పదవిని కట్టబెట్టడం చూస్తే ముఖ్యమంత్రి నిజస్వరూపమేమిటో అర్థమవుతోంది. బాద్యతాయుతమైన ప్రజా ప్రతినిధులుగా ఉండి మహిళలతో గంట వస్తావా, అరగంట వస్తావా అంటూ అసభ్యంగా మాట్లాడిన అవంతి శ్రీనివాసరావు, అంబటి రాంబాబులపై చర్యలు తీసుకోకపోగా మంత్రి పదవులు కట్టబెట్టారు. గుంటూరు జిల్లాలో 13 ఏళ్ల దళిత బాలికపై 80 మంది మానవమృగాలు అత్యాచారం చేసి నరకం చూపించారు. ఈ కేసులో వైసీపీ నేత భూ శంకర్ , ఆప్కాబ్ చైర్మన్ అనిల్ బాబు నిందితులైనా చర్యల్లేవు. అరెస్టయిన భూ శంకర్ వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ రైట్ హ్యాండ్ కావడం, బాబు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు అనిల్ బాబు ప్రధాన అనుచరుడు కావడంతో కేసును పోలీసులు అటకెక్కించారు. మహిళా వాలంటీర్లను లైంగికంగా వేధించిన జోగి రమేష్ ని కనీసం మందలించకపోగా మంత్రి పదవి కట్టబెట్టారు. చిత్తూరు జిల్లా మదన పల్లె ఎమ్మెల్యే నవాజ్ భాషా నాడు – నేడు ఫోటో ఎగ్జిబిషన్ లో బహిరంగంగా ఓ మహిళా మున్సిపల్ చైర్ పర్సన్ తో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆరుగురు ఎమ్మెల్యేలపై మహిళలపై దాడులకు పాల్పడ్డ కేసులు, మరో ఏడుగురిపై కిడ్నాప్ కేసులు ఉన్నాయి. మహిళా ఉద్యోగులను వేధించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వైసీపీ నాయకులపైనా కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడం జగన్ రెడ్డి అంతర్యాన్ని తెలియజేస్తోంది.
అన్న ఎన్టీఆర్ కూతురిని అసెంబ్లీ సాక్షిగా అసభ్యంగా మాట్లాడి యావత్ మహిళా జాతిని అవమానించిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలపై కనీసం చర్యలు తీసుకోకపోగా వాళ్ల బూతులు వింటూ జగన్ రెడ్డి రాక్షసానందం పొందారు. శాడిస్టు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ పార్టీ ఆర్దిక నేరగాళ్ల నుంచి ఆకు రౌడీల వరకు అందరికీ పునారావాస కేంద్రంలా మారింది. వైసిపిలోని 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో 86 మంది పై (57 శాతం) క్రిమినల్ కేసులు ఉండగా, వీరిలో 50 మందిపై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయని ఏడీఆర్ (అసోషియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ ) నివేదిక స్పష్టం చేసింది.
డ్రగ్స్, మాదక ద్రవ్యాలతో రెచ్చిపోతున్న మృగాళ్లు
మద్యపాన నిషేదంపై మాట తప్పిన జగన్ రెడ్డి యువతను డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బానిసలుగా చేయడంతో రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చంద్రబాబు హయాంలో కట్టదిట్టంగా శాంతిభద్రతలు అమలు చేయడంతో నేరాలు అదుపులోకి వచ్చాయి. ప్రభుత్వం శిక్షిస్తుందనే భయంతో గుంటూరు జిల్లా దాచేపల్లిలో చిన్నారిపై అత్యాచారం చేసినవారు చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో రేపిస్టులు, న్యూడిస్టులు సిగ్గు,లజ్జాలేకుండా కాలరెగరేసుకొని రోడ్లపై తిరగే పరిస్థితి నెలకొంది. ఇటీవల ప్రభుత్వం గడపగడపకు మన ప్రభుత్వం పేరిట కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి శాసనసభ్యులను ఇళ్ల వెంట పంపుతోంది. మాధవ్ ఘటన చూశాక వైసిపి ప్రజాప్రతినిధుల తమ ఇళ్లవద్దకు వస్తున్నారంటే మహిళలు భయకంపితులయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. వీరితో ఎంతదూరంగా ఉంటే అంతమంచిదని కొందరు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతుండగా… మరికొందరు వారి కంటపడకుండా జాగ్రత్తపడుతున్నారు.
మహిళలపై 21శాతం పెరిగిన నేరాలు
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధీనంలోని పోలీస్ శాఖ ఇచ్చిన క్రైమ్ రిపోర్ట్ ప్రకారం 2020-21లో మహిళలపై అత్యాచారాలు, దాడులు, లైగింక వేధింపులు తదితర మహిళలపై నేరాలకు సంబంధించి 17,736 కేసులు నమోదయ్యాయి. 2019-20లో 14,603 నేరాలు నమోదుకాగా (14%)… ఏడాదిలో ఏకంగా 21 శాతానికి పెరిగడంలో రాష్ట్రంలో పెరిగిపోయిన విచ్చలవిడి తనానికి, జగన్ రెడ్డి సర్కారు చేతగాని తనానికి నిలువెత్తు నిదర్శనం. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి. విజయవాడ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలైన ఒక యువతిపై కామాంధులు 30గంటలపాటు కన్నవారి ఎదుటే అత్యాచారానికి పాల్పడ్డారు.
అయ్యా తమ బిడ్డకు న్యాయం చేయండని ఆ అభాగ్యురాలి కుటుంబసభ్యులు పోలీసులకు వద్దకు వెళ్తే కనీసం ఫిర్యాదు తీసుకునేందుకు అక్కడి ఖాకీలు నిరాకరించారంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనలో నిందితులను పట్టుకోవడం చేతగాని ప్రభుత్వం ప్రతిపక్షనేతలపై వేధింపులకు దిగింది. బాధితురాలిని పరామర్శించడానికి వెళ్లిన ప్రతిపక్షనేత చంద్రబాబుతోసహా పలువురు టిడిపి ముఖ్యనేతలకు మహిళాకమిషన్ చైర్పపర్సన్ నోటీసులివ్వడంతో యావత్ రాష్ట్రప్రజలు ముక్కున వేలేసుకున్నారు.
గన్నూ లేదు-జగనూ రాడు
ఆడబిడ్డకు కష్టమొస్తే గన్ కంటే ముందు వస్తాడన్న జగన్ ఎక్కడ? మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న మృగాళ్లను గన్నుతో కాల్చేందుకు జగన్ ఎందుకు రావడంలేదు? ప్రతిరోజూ రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో అరాచకపర్వం కొనసాగుతుంటే ఒక్క నిందితుణ్ణీ ఎందుకు శిక్షించలేకపోయారు? అసలు ఏపీలో రూల్ ఆఫ్ లా ఉందా? దిశా పేరుతో ప్రభుత్వం చెప్పిన మాటలు ప్రచారార్భాటంగానే మిగిలిపోయాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణలో అఘాయిత్యం జరిగితేనే తట్టుకోలేకపోయిన ముఖ్యమంత్రి మనసుకు…సొంత రాష్ట్రంలో ఆడబిడ్డల ఆక్రందనలు ఎందుకు వినిపించడంలేదు?
మీ చేతకాని పాలనతో ఇంకెందమంది దిశలను బలితీసుకుంటారు? దిశ చట్టం అమల్లోకి వచ్చాక ముగ్గురికి ఉరిశిక్ష, ఇరవైమందికి జీవతఖైదు విధించామన్న తప్పుడు ప్రకటనలతో ప్రజలను ఎన్నాళ్లు మభ్యపెడతారు జగన్ రెడ్డీ? నిర్భయ నిధి కింద కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు రూ. 112 కోట్లు కేటాయించగా వైసీపీ ప్రభుత్వం కేవలం రూ. 38 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందంటే మహిళా భద్రతపై ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.