- సైకిల్‌పై వచ్చిన ఎంపీ కలిశెట్టి
- అందర్నీ ఆకర్షించిన తెలుగు ఎంపీలు
దిల్లీ: సోమవారం ప్రారంభమైన 18వ లోక్‌సభ తొలి సమావేశాల్లో తెలుగు ఎంపీలు అందర్నీ ఆకర్షించారు. తొలి రోజు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రాటెం స్పీకర్ భర్భ్మహరి మహతాబ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలు తెలుగులో ప్రమాణం చేయడం విశేషం. తొలుత ఎన్డీయే మంత్రివర్గంలోని కేంద్రమంత్రులు జి. కిషన్‌రెడ్డి (భాజపా), కింజరాపు రామ్మోహన్ నాయుడు (తెదేపా), పెమ్మసాని చంద్రశేఖర్ (తెదేపా), బండి సంజయ్ (భాజపా), భూపతిరాజు శ్రీనివాసవర్మ (భాజపా) తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. మంత్రిమండలి సభ్యుల ప్రమాణం పూర్తయిన తర్వాత ఆంగ్ల అక్షరమాల క్రమం ప్రకారం రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ప్రమాణం. చేశారు. తొలుత ఏపీ ఎంపీలకు అవకాశం రాగా… అందులోనూ కొందరు ఎంపీలు తెలుగులో ప్రమాణం చేశారు. వీరిలో మతుకుమిల్లి శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్ (చిన్ని), లావు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు. మిగతావారు హిందీ, ఇంగ్లీష్లలో ప్రమాణం చేశారు. ఇక్క కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెదేపా ఎంపీ కళిశెట్టి అప్పలనాయుడు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా పంచెకట్టులో తొలిరోజు సభకు హాజరయ్యారు. అంతకుముందు కలిశెట్టి సైకిల్‌పై పార్లమెంట్‌కు రావడం విశేషం.