- పల్నాడులో వైసీపీ నేతల నిర్వాకం
- అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారు
- ప్రజావినతుల్లో బాధితుడి ఫిర్యాదు
- అర్జీలు స్వీకరించిన కంభంపాటి, ఆరిమిల్లి
మంగళగిరి(చైతన్యరథం): విభిన్న ప్రతిభావంతులకు 1992లో ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని గత వైసీపీ ప్రభుత్వంలో కబ్జా చేసి అడిగితే తమను చంపేస్తామని బెదిరిస్తు న్నారని పల్నాడు జిల్లా గురజాలకు చెందిన ఆనందరావు గురువారం టీడీపీ కేంద్ర కార్యా లయంలో జరిగిన ప్రజావినతుల కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు. యాచనతో బతుకు తున్న తమ స్థలం కొట్టేసిన వైసీపీ భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుని తమ స్థలం తమ కు ఇప్పించాలని వినతిపత్రం అందజేశాడు. మాజీ రాజ్యసభసభ్యుడు కంభంపాటి రామ్మోహన్, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అర్జీలు స్వీకరించారు.
` పెదకాకాని మండలం నంబూరులో ఉన్న తన పొలం అమ్మకానికి మహేశ్వరరెడ్డి అనే వ్యక్తి తమ వద్ద నుంచి రూ.12 లక్షలు అడ్వాన్స్‌గా డబ్బులు తీసుకున్నాడని.. మిగిలి న డబ్బులు తీసుకెళ్లి పొలం అగ్రిమెంట్ చేయమంటే చేయకుండా తమను ఇబ్బంది పెడు తున్నాడని గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన పల్లా వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశాడు. అతనిపై చర్యలు తీసుకుని పొలాన్ని అగ్రిమెంట్ చేసేలా చూడాలని కోరాడు.
ఇంటిని దహనం చేసిన వారికి పోలీసుల అండ
` చిత్తూరు జిల్లా సదుం మండలం చెరుకువారిపల్లి గ్రామానికి చెందిన రెడ్డప్ప రెడ్డి సమస్యను వివరిస్తూ గత వైసీపీ ప్రభుత్వంలో తమ పొలంలో ఉన్న ఇంటిని అందులో ఉన్న సామగ్రిని పూర్తిగా తగలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇస్తే తీసుకోకుండా నిందితులకే వత్తాసుగా తమపైనే తిరిగి కేసుపెట్టారని ఫిర్యాదు చేశా రు. దీనిపై విచారణ జరిపి అసలు నిందితులకు శిక్షపడేలా చేసి వారికి సహకరించిన పోలీసులను సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశాడు.
` గుంటూరులో తాను కొనుగోలు చేసిన స్థలాన్ని అక్రమంగా మరొకరి పేరు మీద కు మార్చారని.. ఈ అక్రమానికి ఒడిగట్టిన మోసగాళ్లపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని సికింద్రాబాద్‌కు చెందిన చీకటి నవీన్ ఫిర్యాదు చేశాడు.
డబ్బిచ్చినా భూమి రిజిస్ట్రేషన్ చేయలేదు
` తాము ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో అంభవరపు నారాయనరెడ్డి అనే వ్యక్తి వద్ద 4 ఎకరాలు పొలం కొనుగోలు చేసి అందులో రెండు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయిం చుకున్నామని, మిగిలిన భూమిని రిజిస్టర్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నాడని గుం టూరు జిల్లా రెడ్డిపాలెంకు చెందిన పోకా నాగేంద్రమ్మ ఫిర్యాదు చేశారు. అటు మిగిలిన డబ్బులు ఇవ్వకుండా, ఇటు భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నాడని సమస్యను పరిష్కరించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో నేతలు స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు.
` గత ప్రభుత్వంలో కానిస్టేబుల్ అభ్యర్థుల నియామానికి పెట్టిన పరీక్షా ప్రశ్నాపత్రం లో తప్పులు ఉండటంతో అభ్యర్థులకు మార్కులు తగ్గి అన్ క్వాలిఫై అవటంతో ఈవెంట్స్ కు వెళ్లే అవకాశం కోల్పోయామని పలువురు అభ్యర్థులు విన్నవించారు. ఇదే తమకు చివ రి అవకాశమని.. ఇప్పటికే వయసు దాటిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి గత ప్రభుత్వంలో జరిగిన తప్పును సరిచేసి తమకు కానిస్టేబుల్ నియామకాల్లో ఈవెంట్స్ లో పాల్గొనే అవకాశం కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.