- నేరాలు, ఘోరాల ముఠా నాయకుడు జగన్‌రెడ్డి
- హంద్రీనీవా, గాలేరు`నగరి గాలికొదిలేశాడు..
- ధరల బాదుడు తప్ప జగన్ ఏంసాధించాడని?
- పెద్దిరెడ్డి అవినీతి లెక్కలు తేలుస్తా..
- కూటమి ప్రభుత్వంలో హార్టీకల్చర్‌కు ప్రాధాన్యత
- రైల్వేకోడూరు కూటమి సభలో తెదేపా అధినేత చంద్రబాబు
రైల్వేకోడూరు (చైతన్యరథం): పేదల జీవితాల్లో మార్పు రావాలంటే రాష్ట్రం నుంచి సైకోని తరిమికొట్టడం ఒక్కటే మార్గమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సిద్ధం సిద్ధం అని రంకెలేస్తున్న జగన్‌రెడ్డికి రైల్వేకోడూరు ఎన్నికల సభావేదిక నుంచి హెచ్చరిస్తున్నా. ప్రజల సహకారంతో కూటమి.. నిన్ను గద్దె దించడానికి సిద్ధం’ అని చంద్రబాబు విరుచుకుపడ్డారు. రైల్వేకోడూరులో గురువారం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడిగా నిర్వహించిన ఎన్నికల సభలో చంద్రబాబు భారీ జనసందోహాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రాంతంలోని అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణమైన జగన్‌రెడ్డి.. రాష్ట్రంలో మూడు రాజధానులు కడతాననడం విడ్డూరంగా ఉందన్నారు. ధరలు, ఛార్జీలు, పన్నులు పెంచి పేదల నడ్డివిరిచిన జగన్‌రెడ్డి, నాసిరకం మద్యంతో సంపాదించిన కోట్లను తాడేపల్లికి తరలించాడని, ఆరోగ్యాలు దెబ్బతీసి మహిళల మాంగాల్యాలను తెంచిన దుర్మార్గుడని దుయ్యబట్టారు. మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ ఒకే కుటుంబానికి చెందినవాళ్లు ఉన్నప్పటికీ నియోజకవర్గానికి పైసా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఇక్కడ పాపాల పెద్దిరెడ్డి బైరైటీస్‌ను దిగమింగాడని, ఎర్రచందనాన్ని మూకుమ్మడిగా అమ్ముకుని వేల కోట్లు వెనకేశారని దుయ్యబట్టారు. చివరకు చిత్తూరు సీటు వైసీపీ ఒక స్మగ్లర్‌కు ఇచ్చిందని ఎద్దేవా చేశారు.
పెద్దిరెడ్డీ.. నీ పనైపోయింది
మద్యం, ఇసుక, గనుల్లో దోచిన సొమ్ముతో ఓటర్లనే కొనేందుకు పెద్దిరెడ్డి సిద్ధమయ్యాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవులాపల్లి రిజర్వాయర్ పనులు చేయకుండానే రూ.600 కోట్లు దోచేశాడు. ఎన్జీటీ రూ.100 కోట్ల ఫైన్ వేస్తే ప్రజల సొమ్ము జరిమానాగా చెల్లించారు. హంద్రీనీవా పూర్తి చేయలేదు. గాలేరు నగరికి నీరివ్వలేని సిగ్గులేని ప్రభుత్వమిది. హంద్రీనీవాపై గండికోట నుండి మరో ప్రాజెక్టు మంజూరు చేసి, పనులు చేయలేదు కానీ రూ.1500 కోట్ల బిల్లులు లాగేశారు. దందాను బయటపెట్టారనే అంగల్లులో నాతో సహా 600మంది కార్యకర్తలపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. ‘పెద్దిరెడ్డీ.. నీ కుటుంబ పాలన అంతమైంది. నీ దోపిడీకి అంతం పలికేందుకు కోడూరు ప్రజలు నినదిస్తున్నారు. మా ప్రజాబలం ముందు నీ డబ్బుమదం ఆగదు. ఎంపీ మిథున్‌రెడ్డి పిఠాపురం వెళ్లి పవన్‌ను ఓడిస్తానంటున్నాడు. పుడిరగి పెద్దిరెడ్డి కుప్పంలో నన్ను ఓడిస్తాడట. ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే తెలుగు దేశం కార్యకర్తలు, జనసైనికులు, బీజేపీ నేతలు చూస్తూ ఊరుకోరని గుర్తుంచుకో. పెద్దిరెడ్డి అరాచకాన్ని రాజకీయంగా భూ స్థాపితం చేయడం తధ్యం అని చంద్రబాబు హెచ్చరించారు.
రాష్ట్రం కోసం.. ప్రజల కోసం.. కూటమి
ప్రజలు గెలవాలని, నవ్యాంధ్ర పూర్వవైభవం సంతరించుకోవాలనే మూడు పార్టీలు జతకట్టాయని చంద్రబాబు అన్నారు. ‘రైల్వే కోడూరులో తెలుగుదేశం పార్టీ గుర్తు లేకుండా ఎప్పుడూ ఎన్నికలకు వెళ్లలేదు. కానీ, ఈ రోజు కూటమి ధర్మానికి కట్టుబడి జనసేన, బీజేపీ పోటీలో ఉన్నాయి. కూటమిలోని ప్రతి పార్టీ త్యాగాలు చేసింది రాష్ట్రం కోసం. ప్రజలు గెలవాలి. రాష్ట్రం గెలవాలి. అది జరగాలంటే కూటమి గెలవాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘దివగంత వివేకాను ఎమ్మెల్సీగా ఓడిరచింది జగన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి కాదా? అవినాశ్‌రెడ్డికి ఎంపీ సీటు ఇవ్వొద్దని, అవసరమైతే షర్మిలకు ఇవ్వమంటే వివేకాపై దాడి చేసి చంపేశారు. సమాధానం చెప్పమని సునీత రెడ్డి ప్రశ్నిస్తుంటే మాపైకి నింద నెట్టేస్తారా? అక్క చెల్లి అవ్వ తాత అంటూ దగా చేస్తున్నాడు. భార్య మాట విని తల్లిని గెంటేసినోడు ప్రజలకు ఏం చేస్తాడు? మీ కుటుంబంలోని గొడవని రాష్ట్ర గొడవగా చిత్రీకరించాలనుకుంటే ప్రజలు సహించరు. అమాయకుడిగా మొహం పెట్టి, నేరాలు చేసే ఘరానా ముఠా నాయకుడు జగన్ రెడ్డిని తరిమికొట్టాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
చిత్తశుద్ధితో నియోజకవర్గ అభివృద్ధి
కూటమి అధికారంలోకి రాగానే ఎర్ర స్మగ్లర్లకు బేడీలేస్తానన్నారు. బెస్తపల్లి, చెయ్యేరులో ఇసుక దోపిడీని అరికడతామని, కోడూరు వెంకటపల్లి రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తామన్నారు. మామిడి, అరటి, బొప్పాయి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని ప్రోత్సహిస్తానన్నారు. డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్, స్ప్రింక్లింగ్ పునరుద్దరిస్తామన్నారు. చిట్వేలి ప్రభుత్వ జూనియర్ కాలేజీ పనుల్ని పూర్తి చేస్తానని, సోమశిల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంతంలోని చెరువులన్నీ నింపే బాధ్యత తీసుకుంటానన్నారు. చెంగల్రాయుడులాంటి సీనియర్ నాయకుడు తన సీటును త్యాగం చేశాడు. పని చేసిన ప్రతి కార్యకర్తను గౌరవించే బాధ్యత నేను తీసుకుంటానన్నారు. నియోజకవర్గ ఇంఛార్జి రూపానందరెడ్డి చేసిన త్యాగాన్ని గుర్తించి అండగా ఉంటానన్నారు. ప్రతి ఒక్క పార్టీనుంచి ఓటు ట్రాన్స్‌ఫర్ కావాలని, రాజంపేట పార్లమెంటును గెలిపించుకుందామని బాబు పిలుపునిచ్చారు.