.ఆ భయంతోనే జగన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన
.తన అనుచరులను రక్షించుకోడానికి మంతనాలు
.ఏ2 విజయసాయిరెడ్డి అల్లుడి సన్నిహితుడే లిక్కర్ మాఫియా సూత్రదారి
.బహుళ స్వప్రయోజనాల కోసమే ఢిల్లీపర్యటన
.జగన్‌రెడ్డి పర్యటన తేదీ మారుతుంది..విషయం మారదు
.మాజీ మంత్రి కెఎస్ జవహర్ ధ్వజం
అమరావతి: ఢిల్లీలో మద్యం మాఫియా తీగ లాగడంతో భయంతో తన వారిని రక్షించుకునేందుకు జగన్ రెడ్డి హుటాహుటి ఢిల్లీ బయలుదేరి వెళ్లారని మాజీ మంత్రి కెఎస్ జవహర్ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత 22 సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారని, అన్నిసార్లు బహుళ స్వప్రయోజనాల నిమిత్తమే వెళ్లారని చెప్పారు. నేడు దేశాన్ని కుదిపేస్తున్న లిక్కర్ మాఫియా మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారన్నారు. జగన్ రెడ్డి ఎంపీలు, అరబిందో, డర్టీ మాధవ్‌కు సంబంధించిన మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నట్లు తెలిపారు. ఈ నిజాన్ని దాచి పెట్టి వేరే ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్ళినట్లు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. జగన్ రెడ్డి పర్యటనలలో తేదీ మారుతుందేగాని విషయం మారదని ఎద్దేవా చేశారు.
లిక్కర్ మాఫియా మూలాలను కప్పిపుచ్చెందుకే ఆకస్మిక ఢిల్లీ పర్యటనగా పేర్కొన్నారు. రాష్ట్రాన్ని దొచేస్తున్న, ప్రజల ప్రాణాలు తీస్తున్న తన అనుచరులను కాపాడుకోవడంలో ఉన్న శ్రద్ధ, తాపత్రయం ప్రజల సమస్యలపై లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఎ2 విజయసాయి రెడ్డి అల్లుడికి అత్యంత సన్నిహితుడు, లిక్కర్ మాఫియాలో ప్రధాన ముద్దాయిగా ఉన్న వ్యక్తుల్ని కాపాడడంలో జగన్ నిమగ్నుడై ఉన్నారన్నారు. ఈ మాఫియాలో జగన్‌రెడ్డి పాత్ర కూడ ఉందని చెప్పారు. లిక్కర్ మాఫియా గురించి బయటకు వెళ్లడవటం, వివేకా హత్య కేసులో సునీతమ్మ సుప్రీం కోర్టుకు వెళ్లడంతో తాడేపల్లిలోని జగన్ వెన్నులో వణుకు పుట్టిందని చెప్పారు.
ఢిల్లీ వెళ్లిన ప్రతి సారి పోలవరం ప్రాజెక్ట్, నిర్వాసితులు అని జగన్ రెడ్డి సొల్లు కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో పోలవరం నిర్మాణానికి రూ.55వేల కోట్లు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించారని, ఇప్పుడు అదే మొత్తం మంజూరు చేయమని జగన్ రెడ్డి తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ తిప్పలుపడతాడని, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా, పోలవరం నిర్వాసితులు కోసం కాదని స్పష్టం చేశారు. పార్లమెంటు సాక్షిగా చెప్పిన హామీల గురించి జగన్ రెడ్డి కేంద్రాన్ని ఎందుకు నిలదీయండంలేదని ప్రశ్నించారు. 22 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన జగన్ రెడ్డి నేడు సొంత ప్రయోజానాల కోసం ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకుంటున్నాడని మండిపడ్డారు. దేశం అంతా తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించేలా జగన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పారు. జగన్ రెడ్డిని దూరంగా పెడితేనే రాష్ట్రాన్ని కాపాడుకోగలమన్నారు. ఢిల్లీ పర్యటనలలో రాష్ట్రానికి ఏం హామీలు తీసుకొచ్చాడో, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఏం కాపాడారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి 22 సార్లు ఢిల్లీ పర్యటనల వివరాలు బయట పెట్టాలన్నారు. సాధించిన ప్రయోజనాలపై, వెళ్లి రావడానికి అయిన ఖర్చులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను మత్తు పదార్థలకి కేరాఫ్ అడ్రస్ గా మార్చాడని ధ్వజమెత్తారు. లిక్కర్ మాఫియాలో బయటపడ్డ బ్లాక్ లిస్ట్ కంపెనీల మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని చెప్పారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రివర్స్ టెండరింగ్, బహుళార్థక ప్రాజెక్ట్ పోలవరం, రాజధాని అమరావతి విషయంలో రాష్ట్రం పరువును ఎప్పుడో తీసేశారని నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డి తన అనుచరుల కల్తీ మద్యం వ్యాపారాన్నిదేశ వ్యాప్తంగా విస్తరింపజేయడానికి పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. కంపెనీ లైసెన్స్ ల గురించి అరుణ్ రామచంద్ర పిళ్ళై, సమీర్ మహేంద్ర నుంచి రూ.2.4 కోట్ల ముడుపులు అందినట్లు పేర్కొన్నారు. అరబిందో ఇండస్ట్రీస్‌లో కీలక వ్యక్తి శరత్ చంద్రారెడ్డి పేరు లిక్కర్ స్కాంలో వినిపిస్తోందని, ఆయన విజయసాయిరెడ్డి వియ్యంకుడుగా చెబుతున్నారన్నారు. మరో వైపు లిక్కర్ వ్యాపార దిగ్గజం మాగుంట పేరు కూడా వినిపిస్తోందని చెప్పారు. ఆయన కంపెనీలు మూడు చోట్ల సిండికేట్లను దక్కించుకున్నట్లు తెలిపారు. ఇందు కోసం కోట్ల రూపాయలు మడుపులుగా చెల్లించినట్లు ఆరోపణలు వినవస్తున్నాయన్నారు. ఢల్లీి పర్యటనలు, మద్యం మాఫియాపై జగన్ రెడ్డి వివరణ ఇవ్వాలని జవహర్ డిమాండ్ చేశారు.