- వరద బాధితులకు భారీగా విరాళాలు
- సీఎం చంద్రబాబుకు చెక్కులిచ్చిన దాతలు
అమరావతి (చైతన్య రథం): వరద బాధితులకు సాయం అందించేందుకు బుధవారం కూడా దాతలు పెద్దఎత్తున తరలివచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని రాష్ట్ర సచివాలయంలో కలిసి పలువురు విరాళాలు అందజేసి దాతృత్వం చాటుకుంటున్నారు. వ్యాపార ప్రముఖులు, పార్టీ నేతలతో పాటు సామాన్యులు సైతం విరాళాలు అందించేందుకు ముందుకొచ్చారు. వీరికి సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. సమాజం నుంచి ఇంత స్పందన వస్తుందని తాను ఊహించలేదన్నారు. స్కూలు పిల్లలుసైతం కదలివచ్చి విరాళాలు ఇవ్వడం గొప్ప విషయమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. విరాళాలు అందించిన వారిలో…. సంధ్యా మెరైన్స్ తరపున కెవి ప్రసాద్ రూ.కోటి, జీవీపీఆర్ ఇంజనీర్స్ లిమిటెడ్ చైర్మన్ జిఎస్‌పి వీరారెడ్డి, ఎండి శేఖర్‌రెడ్డి రూ.కోటి, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ సత్య ప్రకాష్ సింగ్ రూ.86 లక్షలు, వైశాఖి ఫౌండేషన్ తరపున ఎల్లంకి రవికుమార్ రూ.50 లక్షలు, దర్శి అసెంబ్లీ నియోజకవర్గం ప్రజల తరఫున రూ.37,16,200 రూపాయల విరాళం ముఖ్యమంత్రికి అందచేశారు. అలాగే, దర్శి అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి నాయకులు గొట్టిపాటి లక్ష్మి రూ.10 లక్షలు, అమెరికా కమ్మ సంఘం తరపున శ్రీనివాస్ వుయ్యూరు, కాకర్ల శ్రీనివాస్, కొల్ల అశోక్ బాబులు రూ.30 లక్షలు, మోడల్ డైరీ ఎండి పి ధనప్రకాష్ రూ.30 లక్షలు, మణిపాల్ హాస్పిటల్స్ క్లస్టర్ డైరెక్టర్ డా. సుధాకర్ కంటిపూడి, అసోషియేట్ డైరెక్టర్ జె.రామాంజనేయ రెడ్డి రూ.25 లక్షలు, ఆఫ్రికా కెన్యా టిడిపి తరఫున బొబ్బా శివప్రకాష్ రూ.20 లక్షలు, హైద్రాబాదుకు చెందిన ది సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ రాజు, ఎం.డి. కె.వి.సుబ్బయ్య రూ.10 లక్షలు, విజయవాడ ఆర్థోపెడిక్స్ సొసైటీ తరపున డా.వాసు రూ.5లక్షలు, ఎ.చంద్రమౌళి, పి పార్థసారథి చెరో ఐదు లక్షలు, అమరావతి రోటరీ క్లబ్ తరపున డా.హర్ష రూ.3లక్షలు విరాళాలు ముఖ్యమంత్రికి అందచేశారు. గుంటూరు డా.కె.ఎల్.పి.పబ్లిక్ స్కూల్ విద్యార్థులు రూ.1,84,500లు, స్టేట్ కార్పెంటర్ వర్కర్సు యూనియన్ అమరావతి ప్రెసిడెంట్ పి నాగేశ్వరరెడ్డి రూ.1,15,000లు, రూ.1,00,116 చొప్పున ఇస్రో రిటైర్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున జి వెంకటేశ్వర్లు, సిహెచ్ మస్తాన్ రావు, రూ.లక్ష చొప్పున కె నిషాంత్, డాక్టర్ తరు కాకాని, సిహెచ్ ఖాజావలి, విజయవాడ రాయల్ హాస్పటల్స్ తరపున డా రాజశేఖర్ రెడ్డిలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు.