టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ల అక్రమ అరెస్టును ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఖండించారు. బీసీ అనే పేరు వింటే జగన్కు ఎందుకంత బీపీ ? అని ప్రశ్నించారు. జగన్ పాలనలో బీసీలపై దాడులు, అక్రమ కేసులు నిత్యకృతమయ్యాయన్నారు. తాత రాజారెడ్డి నుంచి మనవడు జగన్ వరకు అంతా బీసీలపై కక్ష్య సాధిస్తున్నారన్నారు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో బీసీలకు జరిగిన న్యాయం కంటే జరిగిన అన్యాయమే ఎక్కువ. బీసీల్నీ ఆర్దికంగా రాజకీయంగా అణిచివేస్తున్న జగన్కు బుద్ది చెప్పేందుకు బీసీలంతా సిద్దంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను పవర్ నుంచి దింపేసి బీసీల పవర్ ఏంటో చూపుతామన్నారు. బీసీ ద్రోహి జగన్ను రాష్ట్రం నుంచి సాగనంపుతామన్నారు.