అమరావతి: కడప జిల్లా సింహాద్రిపురం మండ లంలో టీడీపీ కార్యకర్త పరమేశ్వరరెడ్డి హత్య జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో విస్తరిస్తున్న ఫ్యాక్షనిజానికి నిలువెత్తు నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పరమేశ్వరరెడ్డి హత్యను తెలుగుదేశంపార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి ఫ్యాక్షన్ మనస్థత్వాన్ని, హత్యా ప్రవృత్తిని వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలోనే హత్యలు చేస్తూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నిస్తున్నానంటూ ప్రసంగాలివ్వడం హాస్యాస్పదం అన్నారు. హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న జగన్‌రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పడం తధ్యం అని హెచ్చరించారు. పరమేశ్వరరెడ్డి మరణం పార్టీకి తీరని లోటని పేర్కొ న్నారు. హత్యచేసిన వారిని తక్షణమే అరెస్టు చేయా లని డిమాండ్ చేశారు. పరమేశ్వరరెడ్డి కుటుం బానికి తెలుగుదేశంపార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుం దని కింజరాపు అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.