శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వచ్చే మెజారిటీ ముదిగుబ్బ మండలం నుంచే ప్రారంభం కావాలని పార్టీ శ్రేణులకు నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ సూచించారు. శనివారం ముదిగుబ్బ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అట్టహాసంగా సాగింది. మండలంలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ముదుగుబ్బలో సందడి వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాన్ని పరిటాల శ్రీరామ్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ముదిగుబ్బ మండలంలో తెలుగుదేశం పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారని వారందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ఈ సారి ఈ మండలంలో మెజార్టీ అత్యధికంగా వచ్చేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.