- సలహాలు, సూచనలు ఆహ్వానించిన ఎన్డీఏ నేతలు
- వాట్సాప్ నెంబర్ 8341130393 విడుదల
- రాక్షసపాలన అంతమే ధ్యేయమన్న నేతలు
- ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా మేనిఫెస్టో: వర్ల రామయ్య
అమరావతి (చైతన్యరథం): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో టీడీపీ, జనసేన, భాజపా కూటమి సంయుక్తంగా విడుదల చేయనున్న ‘ప్రజా మేనిపెస్టో’ రూపకల్పనలో ప్రజలను కూడా భాగం చేస్తోంది. మేనిఫెస్టోలో రూపొందించే అంశాలపై ప్రజల నుండి సలహాలను, సూచనలను స్వీకరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 8341130393 నంబర్‌కు సూచనలను పంపొచ్చని కూటమి నేతలు తెలిపారు. ఏపీలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ఎన్డీఏ కూటమి అజెండా అని తెలిపారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, పార్టీ సీనియర్ నేత టీడీ జనార్థన్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మేనిఫెస్టో కమిటీ సభ్యుడు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్, జనసేన నాయకులు గాదె వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు లంకా దినకర్‌లు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో సోమవారం వాట్సాప్ నెంబర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ రాక్షస పాలను అంతం చేయడమే కూటమి లక్ష్యమన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసింది రాక్షసుడిని రాష్ట్రం నుండి తరిమికొట్టేందుకేనన్నారు. ప్రజా పాలనకోసం కోసమే కూటమి ఏర్పడిరదన్నారు. కూటమికి ప్రజా మద్దతు పెద్దఎత్తున ఉందని… కూటమి సభలకు తండోపతండాలుగా వస్తున్న జనమే ఇందుకు నిదర్శనమన్నారు. కూటమి మేనిఫేస్టో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేదిగా ఉంటుందన్నారు. చంద్రబాబు ఆదేశం ప్రకారం ప్రజా అభిప్రాయం కోసం వాట్సాప్ నెంబర్ ను 8341130393 ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు వారి అభిప్రాయాలు తెలియజేస్తే గౌరవంగా స్వీకరిస్తామని పేర్కొన్నారు. వచ్చినవాటిలో మంచి అభిప్రాయాలను మేనిఫెస్టోలో పొందుపరుస్తామని తెలిపారు. కూటమి విజయం కోసం, రాక్షసుడిని తరిమి కొట్టేందుకు ప్రజలు తమ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. రాక్షస పాలనను అరికట్టేందుకు కూటమి చేస్తున్న మహాయజ్ఞంలో ప్రజలు కూడా భాగస్వామ్యం తీసుకోవాలని వర్ల రామయ్య కోరారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే: గాదె
జనసేన నాయకుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్ కోసం కూటమి ఏర్పడిరదని… రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమి నేతలు పనిచేస్తున్నారన్నారు. అందుకే ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు తెలిపారు. దానికోసం ప్రజలను నుండి అభిప్రాయాలను సేకరించేందుకు వాట్సప్ నెంబర్ ను షేర్ చేస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపి ప్రజా మేనిఫెస్టోలో భాగస్వాములు కావాలని కోరారు.
రాక్షస సంహారం కోసమే: లంకా
బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఫలాలు చిట్టచివరి వ్యక్తికి అందించడమే కూటమి లక్ష్యమన్నారు. వికసిత్ భారత్ సుసాధ్యం అయ్యేది వికసిత్ ఆంధ్రప్రదేశ్‌తోనేనని తెలిపారు. దుర్యోధన, నరకాసురుడిలాంటి జగన్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసమే ప్రజా మేనిఫెస్టోను తయారు చేస్తున్నామని తెలియజేశారు. విద్రోహ పాలనను తరిమికొట్టేందుకు ప్రజలు ఏకం కావాలని కోరారు. రాక్షస సంహారం కోసం అవతరించిన త్రిమూర్తులుగా కూటమి జనం ముందుకు వస్తుందని తెలిపారు. ప్రజా మేనిఫెస్టో కోసం, ప్రజల నుండి అభిప్రయాలను సేకరించేందుకు వాట్సప్ నెంబర్ ను విడుదల చేసినట్లు చెప్పారు.