• నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అనిల్ కుమార్ పనితీరుని పీకే బయటపెట్టడంతో జగన్ కు భయపడి మాజీమంత్రి పారిపోయాడు.
• అనిల్ మాటలునమ్మి జగన్ కూడా మోసపోయాడు.
• అనిల్ కుమార్ అభినవకాలకేయుడని నెల్లూరుజిల్లా ప్రజలు చెప్పుకుంటున్నారు. బాహుబలి, భల్లాలదేవుడు ఎవరోచెప్పిన అనిల్ రాజమాత శివగామిఎవరో ఎందుకు చెప్పడు?
“ నారా లోకేశ్ చేపట్టిన యువగళంపాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్రతో ప్రజల్లో నూతనోత్సాహం వచ్చింది. ప్రజలు తెలుగుదేశంపక్షాన ఉన్నారు… యువగళాన్ని ఆదరిస్తున్నారు అనడానికి నిదర్శనం పట్టభద్రఎమ్మె ల్సీ ఎన్నికల్లో టీడీపీసాధించిన విజయమే. యువగళం యాత్రతో నెల్లూరుజిల్లాలో వైసీపీరెక్కలు విరిగిపోయాయి. లోకేశ్ నిత్యంప్రజలకు చేరువఅవుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు.
యువగళం క్యాంప్ సైట్ నుండి నెల్లూరు జిల్లా టిడిపి ముఖ్య నేత పట్టాభి రామిరెడ్డి మాట్లాడుతూ మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ పెద్దరోగ్. అతని గురించి మాట్లాడాలంటే మేం కూడా రోగ్స్ లానే ప్రవర్తించాలి. కానీ మాపార్టీ క్రమశిక్షణ, సభ్యత సంస్కారాలకు కట్టుబడి మేం పరిధి దాటి మాట్లాడటం లేదు. అనిల్ కుమార్ తలకిందులుగా తపస్సుచేసినా నెల్లూరుజిల్లాలో వైసీపీజెండా ఎగరేయలేడు. రెక్కలు విరిగిన పార్టీని పైకి లేపలేడు. నెల రోజులు తన నియోజకవర్గ ప్రజలకు కూడా కనిపించకుండా ఎక్కడోదాక్కున్న అనిల్ కుమార్, ఆత్మీయ సమావశం పేరుతో తన వల్ల తీవ్రంగా నష్టపోయిన సొంత పార్టీనేతల పై నోటికొచ్చినట్టు విమర్శలు చేశాడు.
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అనిల్ కుమార్ పని తీరుని పీకే నివేదిక బయట పెట్టడంతో జగన్ కు భయపడి పరారయ్యాడు. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో అనిల్ కుమార్ పనితీరు పై ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. బాబాయ్ కి న్యాయం చేయలేని అనిల్ కుమార్, తన చుట్టూ ఉన్నవారిని వంచించిన అనిల్ కుమార్ తమకేం న్యాయం చేస్తాడని చెప్పుకుంటున్నారు. నెల్లూరు ప్రజలంతా అనిల్ కుమార్ ని అభినవ కాలకేయుడు అంటున్నారు. చనిపోయిన ఆనం వివేకానందరెడ్డి అనిల్ కుమార్ ను డాక్టర్ కాదు.. పెద్దయాక్టర్ అని ఎద్దేవా చేసేవాడు.
అనిల్ మాటలునమ్మి జగన్ కూడా మోసపోయాడు. అందుకే ఇరిగేషన్ శాఖ కట్టబెట్టాడు. కానీ అనిల్ కుమార్ మూడేళ్లు మంత్రిగా నెల్లూరు జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ లో అంగుళం పని చేసింది లేదు. ఒక్క ఎకరాకు నీరు ఇచ్చింది లేదు. అనిల్ కుమార్ కు నిజంగా జగన్మోహన్ రెడ్డి పై అంత నమ్మకం, అభిమానమే ఉంటే, తన వేషాలన్నీ అతని ముందే వేయాలి. నెల్లూరు వాసుల ముందు అనిల్ ఎన్నివేషాలేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా సొంత పార్టీవారే నమ్మడం లేదు. అనిల్ కుమార్ బాహుబ లి, భల్లాలదేవుడు ఎవరో చెప్పాడు గానీ శివగామి ఎవరో ఎందుకు చెప్పడం లేదు? ” అని పట్టాభి రామిరెడ్డి ఆరోపించాడు