చిలకలూరిపేటలోని తన నివాసంలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.జగన్ కు నాలుగేళ్ల తర్వాత రైతులు గుర్తొచ్చారని. రైతు భరోసా కింద నాలుగేళ్లలో ఎక్కడైనా యంత్ర పరికరాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రకాశం, కృష్ణ జిల్లాల నుంచి పాత ట్రాక్టర్లు తీసుకొచ్చి. నిన్న గుంటూరులో షో చేశారని ఎద్దేవా చేశారు. రూ. 361 కోట్లు యంత్ర పరికరాలు రైతులకు ఇచ్చినట్లు అసత్య ప్రచారం చేస్తోందని. రూ. 185 కోట్ల రాయితీ విడుదల చేసినట్లు చెబుతున్నారని. అందులో కేంద్ర, రాష్ట్ర వాటా ఎంతో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
మంత్రి విడదల రజిని కూడా పంట నష్టమంటూ నవంబర్ లో హడావిడి చేశారని. ఇంతవరకూ పంట నష్ట నమోదు లేదు. రైతులకు పరిహారం ఊసే లేదని. అవినీతి మంత్రి విడదల రజిని సమాధానం చెప్పాలన్నారు. పంట నష్టపోయిన రైతులను జగన్ పూర్తిగా దగా చేశారని. గతంతో ఇవ్వాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ డబ్బులు కూడా ఇవ్వలేదన్నారు. సకాలంలో పంటలకు బీమా చేయాలని చంద్రబాబు అసెంబ్లీలో కింద కూర్చొని నిరసన కూడా తెలిపారని. ఇంతవరకు అతీగతి లేదని పేర్కొన్నారు. శనగలు, మొక్కజొన్నలను ఎక్కడా రైతుల నుంచి కొనుగోలు చేయలేదని. వైకాపా నేతలే తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు అమ్ముకుంటున్నారన్నారు. మంత్రివర్గంలో అత్యంత అవినీతి మంత్రి. విడదల రజిని అని ఆరోపించారు. రైతు బీమా నిధులను కూడా విడుదల చేయకుండా మోసం చేశారని.
రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎక్కడైనా నేరుగా రైతుల నుంచి ధాన్యం కొంటున్నారా? అని ప్రశ్నించారు. సకాలంలో టార్ఫాలిన్ పట్టలు ఇవ్వకపోవడంతో అపార నష్టం జరిగిందని. మా ప్రభుత్వంలో రైతులకు సకాలంలో అన్నీ అందించామన్నారు. రేపు చిలకలూరిపేట నియోజకవర్గంలో ఏరువాక కార్యక్రమం చేయబోతున్నట్లు ప్రత్తిపాటి తెలిపారు. భవిష్యత్ గ్యారెంటీకి రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వస్తున్నాయని, ప్రజలకు ఉన్నత భవిష్యత్ ఇచ్చే ఉద్దేశంతో మంచి మేనిఫెస్టో తీసుకొచ్చామన్నారు. ఏరువాక కార్యక్రమంలో భాగంగా రేపురైతుల సమక్షంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నట్లు చెప్పారు. సీఎం జగన్ సొంత జిల్లాలోనూ యువగళం పాదయాత్రకు విశేష ఆదరణ లభిస్తోందని.
లోకేశ్ యువగళం పాదయాత్ర పెనుఉప్పెనలా మారుతోందని. లోకేశ్ జొలికి వస్తే రాష్ట్రంలో జగన్ ఎక్కడా తిరిగే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు. ఒడిశా రైలు ప్రమాద ఘటన అత్యంత దురదృష్టకరమని. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. తెలుగుదేశం పార్టీలో వివాదాలకు తావులేదని. అధినేత నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని అన్నారు. పేదలు, పెత్తందార్లు అంటూ జగన్ కొత్త పల్లవి అందుకున్నారని. ఏడు ప్యాలెస్ లు ఉన్న జగన్. పేదవాడు ఎలా అవుతారని. దేశంలోనే అత్యంత ధనికుడు జగన్ రెడ్డేనని విమర్శించారు.