• కోవూరు నియోజకవర్గం, పాటూరు చేనేత కార్మికులు నారా లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
• మీరు అధికారంలోకి వచ్చాక చేనేతను ఉపాధిరంగంగా చూడాలి.
• చేనేతలు నేసిన వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం లేదు.
• అన్ని ముడిసరుకులపై 42 శాతం జీఎస్టీని ఈ ప్రభుత్వం వసూలు చేస్తోంది.
• చేనేతపై ఆధారపడిని 8 ఉపవృత్తుల వారికి ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందడం లేదు.
• ఈ ప్రభుత్వం ఆదునిక డిజైన్లు తయారు చేయడానికి అవరసరమైన మిషనరీలు ఇవ్వడం లేదు.
• నెల్లూరు జిల్లాలో తయారు చేసిన వస్త్రాలను చేనేత బజారు ఏర్పాటు చేయాలి.
• చేనేత కార్మికులు మగ్గాలు ఏర్పాటు చేసుకునేందుకు వర్క్ షెడ్స్ ఏర్పాటు చేయాలి.
• చేనేతలకు సంబంధించిన 11 రకాల రిజర్వేషన్లు అమలు చేయాలి.
• 1979లో నెల్లూరు సిటీ గాంధీ నగర్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కాటన్, డైయింగ్ కోసం హీట్ ప్లాంట్ కు 7.10 ఎకరాల స్థలం కేటాయించారు.
• కానీ కొన్ని కారణాల వల్ల ప్లాంట్ పనులు నిలిచిపోయాయి. ఆ ఫైలు తిరుపతిలో ఆప్కో కార్యాలయంలో ఉంది.
• చేనేతలకు తమిళనాడు తరహాలో రూ.వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలి.
• చేనేత కార్మికులకు ప్రభుత్వ హామీతో వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• జగన్ అసమర్థ పాలనతో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయింది.
• గత నాలుగేళ్లలో 60 మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం ఒక్కరికి కూడా పరిహారం అందించలేదు.
• టీడీపీ హయాంలో రూ.110 కోట్ల రుణాలను మాఫీ చేశాం.
• టిడిపి అధికారంలోకి వచ్చాక చేనేత కార్మికల కోసం కామన్ వర్క్ షెడ్లు ఏర్పాటు చేస్తాం.
• కేంద్రంతో మాట్లాడి జీఎస్టీ రద్దు చేయిస్తాం..లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చేస్తాం.
• అధికారంలోకి రాగానే చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తాం.
• గతంలో మాదిరిగా యార్న్, పట్టు సబ్సీడీలను అధికారంలోకి వచ్చాక మళ్లీ అందిస్తాం.
• చేనేత కార్మికులకు చంద్రన్న బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలను కల్పిస్తాం.
• చేనేత పనివారలకు ఎటువంటి పూచీకత్తులేకుండా సబ్సిడీ రుణాలను అందజేస్తాం.