రాజమండ్రి : జగన్ దుర్మార్గపు పాలనతో రాష్ట్రానికి పట్టిన చీడను వదిలించటానికి జనసేన, తెలుగుదేశం పార్టీల పొత్తుఅనివార్యమని,ఈమేరకు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. నిన్న జరిగిన ఐక్య కార్యాచరణ కమిటిసమావేశం అనంతరం ఆయ న విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న దుస్థితిని, దాని పరిష్కారమార్గాలను వివరించారు. రాష్ట్రానికి పట్టిన వైసిపి అనే వైరస్‌కు జన సేన-టిడిపి కలయిక సరైన వ్యాక్సిన్ అని పవన్ అన్నారు. చంద్రబాబుతోపాటు ఇతర ప్రతిపక్ష నాయ కులను జగన్‌రెడ్డి ప్రభుత్వం వేధిస్తున్న వైనాన్ని, ప్రజలను భయభ్రాంతులను చేస్తున్న వికృత వైఖరిని, పొత్తు ప్రధాన లక్ష్యాలను పవన్ కల్యాణ్ వివరించారు.
పలురోజుల క్రితం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన ఘటనను, రాష్ట్రంలోకి తనను రాకుండా అడ్డుకున్న తీరును, జగన్‌రెడ్డిపాలసీ టెర్రరిజాన్ని, విజయనగరం లో బీజేపీ కార్యకర్తను పొడిచి ప్రేగులు తోడిన దుష్ట చర్యలను వివరిస్తూ పవన్ కల్యాణ్ రాష్ట్రంలో నెల కొన్న అరాచకతను సోదాహరణంగా తెలిపారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టుతో మొదలై చంద్రబాబును వేధింపులకు గురిచేసేదాక జగన్‌రెడ్డి ప్రభుత్వం చేసిన కిరాతకపు చర్యలను వివరిస్తూ రాష్ట్రంలో నెలకొన్న అస్థిరత,అభద్రతలను తొలగించి సుస్థిరత, భద్రతకు ఇవ్వాల్సిన ఆవశ్యకతను పవన్ కల్యాణ్ నొక్కి వక్కాణించారు. 2014లో జనసేన ఏర్పా టైనప్పటినుంచి దేశ సంరక్షణతో పాటు, తెలుగు ప్రజల సఖ్యత, అభివృద్ధి ముఖ్య లక్ష్యాలుగా పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
విజనరీ నాయకత్వానికి మద్దతు ఉమ్మడి రాష్ట్ర విభజనతో ఏర్పాటైన నవ్యాంధ్రకు ఒక విజన్(దార్శనికత) కలిగిన నాయకుడి అవసరం కొత్తరాష్ట్రానికి ఉన్నందున 2014ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా నిలబడ్డానని పవన్ కల్యాణ్ వివరించారు. అదే పరిస్థితి నేడు ఉందని ఆయన తెలిపారు. వైసీపీకి, జగన్‌రెడ్డికి తాము వ్యతిరేకం కాదని.. కేవలం నేడు రాష్ట్రంలో జరు గుతున్న దాడులకు, దోపిడీకి మాత్రమే తాము వ్యతిరేకమని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. మద్యాన్ని నిషేధిస్తామని ఆనాడు హామీ ఇచ్చి ప్రజల నాడీవ్యవస్థను దెబ్బతీసే మద్యాన్ని అమ్ము తూ రూ.34వేల కోట్లు మద్యం అమ్మకాల్లో దోపి డీ చేశారని.. అదే రీతిన ఇసుక దోపిడి జరుగు తోందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వీటిని అడ్డుకోవడానికే, ఎన్డీఏలో ఉంటూ కూడా రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భద్రతకోసం రాజ మహేంద్ర వరంలోనే తాముచారిత్రాత్మకమైన ప్రకటన చేశామని పవన్ కల్యాణ్ వివరించారు.
ఆదికవి నన్నయ్య, సంఘ సంస్కర్త కందుకూరు వీరేశలింగం పంతులు పుట్టిన గడ్డ, 73 ఏళ్ల వయసులో సీనియర్ నాయకుడు చంద్ర బాబును జైల్లో నిర్బంధంచేసిన రాజ మహేంద్ర వరంలోనే ఇరు పార్టీల సమన్వయ సమావేశం జరగటం ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశమని పవన్ అన్నారు. బాపట్ల జిల్లాలో ఒక 14ఏళ్ల యువకుడిని పెట్రోల్ పోసి తగులబెట్టిన వ్యక్తికి బెయిలు వచ్చినా.. చంద్రబాబుకు బెయిల్ రాకు ండా అడ్డుకోవడం అన్యాయమని ఆయన ఆవే దన వ్యక్తంచేశారు. ఈ దారుణాలకు వైసీపీ పోవ టమే విరుగుడు అని,జనసేన-తెదేపాల ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమని పవన్ స్పష్టం చేశారు.
ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇవ్వటానికి, జైలులో ఉన్న చంద్రబాబుకు మద్దతుగా నిలబడ టానికి, టీడీపీ శ్రేణులకు తోడుగా ఉండటానికి.. ఈ మేరకు సందేశాన్ని ఇవ్వటానికి రాజ మహేం ద్రవరంలో సమావేశాన్ని నిర్వహించినట్లు పవన్ కల్యాణ్ వివరించారు. నిన్నటి సమావేశంలో చర్చించిన అంశాలను తెలుపుతూ.. ఉమ్మడి కనీస ప్రణాళిక(కామన్ మినిమమ్ ప్రోగ్రామ్) ఎలా ఉండాలి, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా ఉద్యమించాలి, ఎలా ముందుకు సాగాలి, ఇరు పార్టీల నాయకులు,కార్యకర్తలు ఎలా కలిసి పనిచేయాలి అన్న విషయాలను చర్చించామని పవన్ కల్యాణ్ తెలిపారు. యనమల రామకృష్ణుడు, నాదెండ్ల మనోహర్ వివిధ అంశాలను లోతుగా విశ్లేషిం చారని ఆయన తెలిపారు.
సుస్థిర పాలనను అందించడంతో పాటు యువత, మహిళలు, రైతుల శ్రేయస్సుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను తెదేపా నేత నారా లోకేష్ వివరించినట్లు.. అందులో తమ పార్టీ ఆలోచనలు కూడా ప్రతి బింబించినట్లు పవన్ కల్యాణ్ వెల్లడిరచారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఇరు పార్టీల మొదటి సమావేశం మరలా రాజమండ్రి లోనే నిర్వహిస్తామని ఆయన అన్నారు. అనం తరం పొత్తు గురించి ఒక విలేఖరి సంధించిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఇరు పార్టీల మధ్య ఎటు వంటి గొడవలు రావని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఉన్నతాశయాలతో ఏర్పడిన పొత్తు కనుక అటువంటి సమస్య ఉండబోదన్నారు.