టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. బుధవారం ఉదయం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఆయనకు చంద్రబాబు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ గంటన్నర పాటు చర్చలు జరిపారు. రెండో ఉమ్మడి జాబితాలో అభ్యర్థుల ఎంపికపై ఇరువురు అధినేతలు కీలక చర్చలు జరిపారు. రాష్ట్రంలో జనసేనకు ఇచ్చిన సీట్లు, రెండు పార్టీల మధ్య సమన్వయం వంటి అంశాలపై కూడా చర్చలు జరిపారు.
మూడవ ఉమ్మడి సభ ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై కూడా సమాలోచనలు జరిగాయి. ఉమ్మడి మేనిఫెస్టో అంశంపైనా ఇద్దరు నేతలు లోతైన చర్చలు జరిపారు.