ఎమ్మిగనూరు ఎస్ బిఐ సర్కిల్ వద్ద పిడిఎస్ యు విద్యార్థి సంఘాల నేతలు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి చేస్తానని చెప్పి నేటికీ పూర్తిచేయలేదు.
బిసి, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో ఎటువంటి పనులు ప్రారంభించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది.
పీజీ విద్యార్థులకు చదువు దూరం చేసే జీవో నెంబర్ 77 రద్దు చేయాలి.
ఎయిడెడ్ విద్యాసంస్థల చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ అమలుచేయాలి.
ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలి.
ప్రాథమిక విద్యను నాశనం చేసే జీవో నెంబర్ 84, 85, 117 జీవోలను రద్దు చేయాలి.
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2.55 లక్షల పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నాం.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
నాడు – నేడు పనుల్లో వైసీపీ నేతలు పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడుతున్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పాలిట వరంగా ఉన్న బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్లను ఈ ప్రభుత్వం రద్దు చేసింది.
టీడీపీ రాగానే బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్లను ప్రవేశపెట్టడంతో పాటు, హాస్టళ్లను వేగంగా నిర్మిస్తాం.
జిఓ నెం.77ని రద్దుచేసి పాత ఫీజు ఎంబర్స్ మెంట్ విధానాన్ని ప్రవేశపెడతాం.
ప్రతిఏటా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని జగన్ రెడ్డి ఇచ్చిన హామీని మర్చి పోయారు.
టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతిఏటా జాబ్ క్యాలండర్ ఇస్తాం.