- రానున్న ఎన్నికల్లోనూ అరాచకాలు సృష్టించే అవకాశం
- చిత్తూరు జిల్లా పరిణామాలపై స్వతంత్ర ఏజెన్సీతో విచారణ
- కేంద్ర బలగాలను, పరిశీకులను పెద్ద ఎత్తున పంపండి
- ఎన్నికల కమిషన్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు లేఖ
అమరావతి, చైతన్యరథం: 2021 స్థానిక సంస్థల ఎన్నికల సంధర్బంలో ఎన్ని కల సంఘాన్ని దూషిస్తూ, జిల్లా కలెక్టర్లను బెదిరించిన వైకాపా మంత్రి పెద్దిరెడ్డి.. రాబోయే సాధారణ ఎన్నికల్లో సైతం చిత్తూ రులో అరాచకాలు సృష్టించే అవకాశం ఉం దని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నా యుడు పేర్కొన్నారు. ఈమేరుకు ఎన్నికల కమీషన్‌కు ఆయన లేఖ రాశారు. రాష్ట్రం లో వైకాపా ప్రభుత్వం చేసిన నిరంకుశ పాలన తీరుపై గతంలో ఎన్నికల సంఘా నికి అనేకమార్లు పిర్యాదుచేశామని, వాటిని మరోమారు మీ దృష్టికి తీసుకొస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నిక ల్లో అధికారపార్టీ వైకాపా నాయకులు అనే క అరాచకాలకు పాల్పడ్డారని, పోటీ చేయా లనుకున్నవారి నామినేషన్ పత్రాలు బల వంతంగా లాక్కెళ్లారని,నామినేషన్ కేంద్రం లోకి సైతం వారిని అనుమతించలేదని అన్నారు.
వైకాపా గూండాలు రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ను సైతం లెక్కచేయలేదని, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పై మౌఖిక దాడులకు దిగారని గుర్తు చేశారు. దీంతో తనను, తన కుటుంబ సభ్యుల ను అధికారపార్టీ నేతలు బెదిరిస్తున్నారని.. రక్షణ కల్పించాలని కేంద్ర హోంశాఖా కార్యదర్శికి ఎస్.ఈ.సీ లేఖ రాయాల్సి వచ్చిందని చెప్పారు. నాడు పెద్దరెడ్డి కలెక్ట ర్లను బెదిరిస్తూ మాట్లాడిన వీడియో క్లిప్పిం గ్ను లేఖకు జతచేసిన పంపినట్లుచెప్పారు. చిత్తూరు జిల్లా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు బోర్డర్లో ఉందని, చిత్తూరు నుంచి పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందని, ఇందులో పెద్దిరెడ్డి పాత్ర ఉందని అన్నారు.పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన వాడు కావడంతో అరాచకాలు, అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందన్నా రు. చిత్తూరు జిల్లా రాజకీయ పరిస్థితులపై స్వతంత్ర ఏజెన్సీతో విచారణ చేయించి శాంతియుత ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పారదర్శక ఎన్నికలు నిర్వహణకు పెద్ద సంఖ్యలో కేంద్ర బల గాలను, పరిశీలకులను నియమించండి.