- నీతులు చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు
- వారి అక్రమాలకు వేల ఫిర్యాదులే నిదర్శనం
- ఫైళ్లను తగులపెట్టించడం ఆయనకు ఆలవాటే
- రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి(చైతన్యరథం): అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం దోపిడీ చేసి న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరుల పాపాలు పండాయని రెవెన్యూ, స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. చేసిన పాపాల ను కప్పిపుచ్చుకోవడానికి ఫైళ్లను తగులబెట్టి ఇప్పుడు అమాయకపు మొఖం పెడితే ప్రజ లు నమ్మే స్థితిలో లేరన్నారు. పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు ఎన్ని అక్రమాలకు పాల్ప డ్డారనే దానికి.. వారికి వ్యతిరేకంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భూ వివాదాలకు సం బంధించి తమకు అందిన వేల ఫిర్యాదులే నిదర్శనమని తెలిపారు. వారి కుటుంబాన్ని తమ ప్రభుత్వం వేధిస్తోందని పెద్దిరెడ్డి చెప్పడం విచిత్రంగా ఉందని, పెద్దిరెడ్డి కుటుంబమే తమను వేధించిందంటూ వేలాది మంది ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదులు ఇచ్చారని గుర్తుచేశారు. మదనపల్లె ఫైళ్ల దహనం ఘటన కుట్ర కోణంలోనే జరిగిందని, సీఐడీ విచారణలో దోషులను కచ్చితంగా తేలుస్తామని చెప్పారు. ప్రాథమిక సమాచారం మేరకు ఈ ఘటనలో పెద్దిరెడ్డి అనుచరుల పాత్ర ఉందని, దోషులు ఎంతటి వారైనా వదలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పాపాలు చేయడం..ఫైళ్లను తగులపెట్టడం వైసీపీ నేతలు ముఖ్యంగా పెద్దిరెడ్డి అలవాటుగా చేసుకున్నారని విమర్శించారు. మదనపల్లె ఘటనకు ముందు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఫైళ్లను కూడా దహనం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.