- లోటు బడ్జెట్లో ఉన్నా రైతులు, ప్రజలకు అండ
- గత ప్రభుత్వ నిర్ణయాలతో పాల సంఘాల నాశనం
- మైలవరం సమగ్రాభివృద్ధికి ఎమ్మెల్యేతో కలిసి చర్యలు
- త్వరలో గొల్లపూడి దగ్గర వెస్ట్రన్ బైపాస్ పనులు
- ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ దగ్గర కృష్ణా హారతి
- అనంతవరంలో పాల కేంద్రానికి ప్రారంభోత్సవం
మైలవరం(చైతన్యరథం): రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబా బు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు అందజేయటం, రాజధాని అమరావతి నిర్మాణం కోసం చర్యలు మొదలుపెట్టడంతో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వంపై మరింత విశ్వాసం, నమ్మకం పెరిగిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గం అనంతవరంలో మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం నిర్మించిన నూతన పాల కేంద్రం భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మె ల్యే వసంత కృష్ణప్రసాద్‌తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి పాల కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే, ఎంపీలను ఘనంగా సన్మా నించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేశినేని మాట్లాడుతూ ఎన్టీఆర్ కృషి వల్లే నేడు గ్రామాల్లో పాల సహకార సంఘాలు కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోటు బడ్జెట్లో ఉన్నా రైతులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ముఖ్యమం త్రి చంద్రబాబు అండగా ఉంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో అమూల్ లాంటి కార్పొరేట్ సంస్థలను తెచ్చి పాల సహకార సంఘాలను నాశనం చేయాలని ప్రయత్నించిందన్నారు.. రైతులందరూ ఎన్ని కష్టాలు ఎదురైనా ఒక మాట మీద నిలబడి ఉన్నందుకు అభినందనలు తెలిపారు. రైతులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటూ సహ కారం అందించిన కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ సి.హెచ్.ఆంజనేయులు కృషిని కొనియాడారు. రాజధాని అమరావతితో పాటు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో కలిసి మైలవరం సమాగ్రాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. త్వరలో ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద కృష్ణా నది హారతి కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే గొల్లపూడి దగ్గర వెస్ట్రన్ బైపాస్ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు.
అమూల్ సంస్థకు ఆస్తులు కట్టబెట్టారు
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో తొలిసారిగా ఎంపీ కేశినేని శివనాథ్‌తో కలిసి పాల కేంద్ర భవనం ప్రారంభించటం సంతోషంగా ఉందన్నా రు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయాలి…ప్రజాప్రతినిధులు మిగిలిన సమయం లో అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. అయితే గత ప్రభుత్వం ఈ విషయం మరిచిపోయి పాలన సాగించిందన్నారు. జగన్ పాల సహకారం సంఘాలను నిర్వీర్యం చేయాలని చూశాడని, అందుకే ప్రజలు గద్దె దింపి బుద్ధి చెప్పారన్నారు. అమూల్ సంస్థకు వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు జగన్ కట్టబెట్టాడని తెలిపారు. ప్రజలంతా ఏకంగా ఉంటే ప్రజాస్వామంలో ఏ వ్యవస్థను ఏమీ చేయలేరన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గూగులోతు కోటమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు తాతా పోతురాజు, రాష్ట్ర నాయకులు జంపాల సీతారామయ్య, సీనియర్ నాయకులు బొందలపాటి సుధాకర్, కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ సి.హెచ్.ఆంజనేయులు, అనంతపురం పాల కేంద్ర సొసైటీ అధ్య క్షురాలు బొందలపాటి శైలజ, కృష్ణా జిల్లా యూనియన్ డైరెక్టర్ ఈశ్వర్‌బాబు, జిల్లా యూనియన్ పాలకవర్గ సభ్యులు ఉయ్యూరు అంజిరెడ్డి, చెరుకూరి రaాన్సీరాణి తదిత రులు పాల్గొన్నారు.