చిత్తూరు: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్య క్షురాలు పురంధేశ్వరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డా రు. శుక్రవారం ఆమె ఆమె మీడియాతో మాట్లా డుతూ సొమ్ము కేంద్రానిది సోకు జగన్ ప్రభుత్వా నిది అన్న చందంగా పాలన సాగుతోందన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కేంద్రం ప్రభుత్వం చొరవతో చేపట్టిన జాతీయ రహదారులు మినహా రాష్ట్రంలో రోడ్ల పరి స్థితి అత్యంత దయనీయంగా ఉంది. చిత్తూరు విజయ సహకార పాలడైరీని 99ఏళ్లకు అమూల్ సంస్థ కు అప్పగించడం దారుణం. చిత్తూరు సహకార చక్కర ఫ్యాక్టరీని తెరపించకపోగా ఆస్తులను అమ్మేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధంకావడం బాధాకరం. పండ్ల పరిశ్రమల యాజమాన్యాలతో ప్రభుత్వం సిండికేట్ అయి మామిడి రైతులను దోచుకుం టోంది. ఇలాంటి ప్రభుత్వాన్ని శాశ్వతంగా ఇంటికి పంపాల్సిన అవసరం ఉందన్నారు.
మా ప్రశ్నలపై జవాబు చెప్పకుండా.. ఇతరులపై కేసులా?: పురందేశ్వరి
ఏపీలో మద్యం అమ్మకాలపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు వైసీపీ ప్రభుత్వం ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని పురంధేశ్వరి ప్రశ్నించారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభు త్వంపై ఉందన్నారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా… ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతు న్నారని మండిపడ్డారు. జనసేన పార్టీతో బీజేపీ పొత్తు కొనసాగుతోందని… ఇతర పార్టీలతో పొత్తు లపై ఎన్నికలకు ముందుపార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రజలకు నిజమైన సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని అన్నారు. సబ్ కే సాథ్, సబ్ కే వికాస్ పేరుతో ముందుకెళ్తున్నామని తెలిపారు.