- టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు
- క్రోసూరులో పార్టీ కార్యాలయం దగ్ధంపై ఆగ్రహం
- ఓటమి ఖాయమని తేలటంతో వైసీపీ మూకలకు దిక్కుతోచటం లేదని విమర్శ
అమరావతి (చైతన్యరథం): తిరిగి అధికారంలోకి రావడం కల్ల అని అర్థమైన వైసీపీ నేతలు విచ్చలవిడిగా విధ్వంసానికి పాల్పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. క్రోసూరులో టీడీపీ కార్యాలయం దగ్ధం చేయటంపై ఆయన మండిపడ్డారు. అధికారాన్ని కోల్పోవడం ఖాయం అని తెలిసాక వైసీపీ రౌడీమూకలకు నిద్రపట్టడం లేదన్నారు. అందుకే పిచ్చెక్కి అర్ధరాత్రి సమయంలో పల్నాడు జిల్లా, క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు.. క్రోసూరు ప్రజాగళం సభకు వచ్చిన జన స్పందన చూసి ఓర్వలేక ఈ పనిచేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీయిజం, విధ్వంసం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం… ఇదే వైసీపీ వాళ్ళ నైజం. ప్రజలంతా ఏకమై రాజకీయాల నుంచి వైసీపీ రౌడీలను తరిమి కొట్టాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.