వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని రాజాం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి, మాజీ మంత్రి కొండ్రు మురళీ మోహన్ అన్నారు. గ్రామస్తులతో కలిపి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి కేటాయించిన నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించడంతో, గ్రామాలు అభివృద్ధికి నోచుకోక కుంటిపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్ లో నిత్యవసర సరుకుల ధరల పెరుగుదల, ఇసుక మాఫియా, త్రాగునీటి సమస్యలు, రైతులు పండిరచే పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు నష్టపోతున్నారని అన్నారు.
దేశంలోనే ఎక్కువగా అప్పులు బాధలతో ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఆత్మహత్యలు పెరిగాయని కొండ్రు దుయ్యబట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తన అనాలోచితి నిర్ణయాలతో నియంత పాలనను కొనసాగిస్తూ మౌలిక సదుపాయాలు లేని రాష్ట్రముగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.