ఏలూరు: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు తారుమారు అయ్యాయని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బడేటి చంటి ఆరోపించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ 11వ రోజు ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రజా చైతన్యం పేరుతో చేపట్టిన పాదయాత్ర స్థానిక 25వ డివిజన్ శనివారపుపేట లో నిర్వహించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించటంతో పాటు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ముద్రించిన కరపత్రాలను బడేటి చంటి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వంలో అన్ని ధరలు పెరిగి సామాన్యులు బ్రతకలేని పరిస్థితి తలెత్తిందని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలలో జగన్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉప్పాల జగదీష్ బాబు, గూడవల్లి శ్రీనివాసరావు, మట్టా రంజిత్, లంకలపల్లి మాణిక్యాలరావు, షేక్ సులేమాన్, చేకూరి గణేష్, బయ్యారపు కుటుంబరావు, పొలాసి, కాకాని శ్రీనివాస్, అద్దంకి రాంబాబు, ఆత్మకూరి మరియదాసు, బయ్యారపు శంకర్, అడ్డాల రాజు, తెలుగు మహిళ అధ్యక్షురాలు తవ్వా అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.