- సీఎం సహాయ నిధికి రూ.400 కోట్లు
- దాతలందరికీ పాదాభివందనం చేస్తున్నా
- మాటల్లో చెప్పలేని వితరణ స్ఫూర్తి ఇది
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి (చైతన్య రథం): ముఖ్యమంత్రి సహాయ నిధికి దాతల విరాళాలు.. వరదలై పారాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.400 కోట్ల విరాళాలు వచ్చాయి. దాతలు చూపిన చొరవ, మానవతా దృక్పథంతో ముందుకొచ్చిన తీరు స్ఫూర్తిదాయకం. వీల్‌ఛైర్‌లో సైతం వచ్చి విరాళాలిచ్చారు. విపత్తు వచ్చినప్పుడు సాటివారికి సాయం చేయాలనే వారి తపన ఎంతో స్ఫూర్తినిచ్చింది. చిన్నపిల్లలు సైతం తాము దాచుకున్న సొమ్మును ఇచ్చారు. దాతలందరికీ పాదాభివందనం చేస్తున్నా. రూ.7,600 కోట్ల మేర నష్టం వాటిల్లితే.. ఈరోజు ప్రభుత్వ సాయంకింద రూ.602 కోట్లు విడుదల చేశాం. ఇందులో రూ.400 కోట్లు దాతల విరాళాలే.
ఇది చరిత్రాత్మకం. ఆర్థిక వెసులుబాటు లేకపోయినా హదుద్, తిత్లీకంటే మెరుగైన ప్యాకేజీ ఇచ్చాం. 16 జిల్లాలపై భారీ వర్షాలు, వరద ముంపు ప్రభావంపడగా, ఈరోజు బాధితులకు ఆర్థికసాయాన్ని అందించాం. రాష్ట్రంలో 905 గ్రామాలు, 227 మండలాలు, 16 జిల్లాలపై వరదల ప్రభావం పడిరది. వరదల్లో నష్టపోయిన నాలుగు లక్షల మందికి పరిహారం అందించాం. రాష్ట్రం మొత్తంమీద 74 మంది మరణించారు. విజయవాడలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో నీళ్లు వచ్చిన వారికి రూ. 25 వేలు, ఒకటి, ఆపై అంతస్తుల్లో ఉన్నవారికి రూ. 10 వేల చొప్పున అందించాం. ఈ పరిహారం అందించడంలో చిన్నాపెద్దా తేడా చూడలేదు.