రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి ఆధ్వర్యంలో జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు ఫూలే దేశానికి చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. ఆయన చిత్రపటానికి, విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిడిపి నేతల మాట్లాడుతూ… అంటరానితనం, కులవ్యవస్థ నిర్ములనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతి రావ్ పూలే అని పట్టణ అధ్యక్షుడు పసుపులేటి నాగరాజు కొనియాడారు.
మహాత్మా జ్యోతి రావు పూలే సందర్భంగా మంగళవారం ఉదయం రాయదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బాల్య వివాహాలను రూపుమాపడంలో పూలే కృషి అనిర్వచనీయం అన్నారు. వితంతు పునర్వివాహాల గురించి ఫూలే ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చాడన్నారు. వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతికోసం, మహాత్మాఫూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదన్నారు. అసమానతలు లేని సమాజం కోసం అలాగే సమానత్వం, హక్కుల కోసం అహర్నిశలు ఎనలేని కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పూలే ఆశయ సాధనకై కృషి చేయాలని అలాగే ఆయన అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పోరాళ్ల పురుషోత్తం, నాయకుల తిప్పేస్వామి, పైతోట సిద్దన్న, ఉడేగోళం శివ, జిల్లా మైనార్టీ నాయకులు ఉస్మాన్, గఫుర్, వేణు, సిమెంట్ శీనా, వై. వెంకటేశులు, కావలి రవి, పైతోట రామంజి, సిమెంట్ శీనా, కల్యం తిప్పేస్వామి, మల్లెషి, జావీద్, భజంత్రి కృష్ణ, దాసరి సత్తి, చిన్ని కృష్ణ, జయరాముడు, నాగరాజు, తమ్మన్న, బంజోబ తదితరులు పాల్గొన్నారు.
కందుకూరులో….
కందుకూరు మండల కేంద్రమైన లింక్సుంధరలోని టిడిపి మండల పార్టీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి మండల టిడిపి అధ్యక్షులు వేముల గోపాలరావు పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జి విశ్వనాధపురం గ్రామ సర్పంచ్ బొల్లినేని నాగేశ్వరరావు తెలుగు యువత అధ్యక్షులు అడపా రంగయ్య టిడిపి నాయకులు గాలంకి ప్రసాదు, గొల్లపల్లి వెంకటేశ్వర్లు, బోడి సురేష్ , నారిబోయిన నారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు.
అవనిగడ్డలో….
జ్యోతిరావు పూలే 196వ జయంతి సందర్భంగా అవనిగడ్డ టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా వెంకట్రామ్ మాట్లాడుతూ సమాజంలో కుల వివక్షత, అంటరానితనం, కళ్ళారా చూచి వివక్షతను అనుభవించి, సమాజంలో సమానత్వం కోసం సామాజిక విప్లవం కోసం జీవితాంతం పోరాడిన యోధుడు అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లూరి వెంకటేశ్వరరావు, యాసం చిట్టిబాబు, కర్రా సుధాకర్, బండే రాఘవ, ఘంటసాల రాజ మోహన్ రావు, అన్నపురెడ్డి లక్ష్మీనారాయణ, షేక్ బాబావాలి, మండలి రామ్మోహన్రావు, బచ్చు రఘునాథ్, బర్మ శ్రీను, మెగావత్తు గోపి, బచ్చు మురళి, కొండవీటి పాండురంగారావు, అవనిగడ్డ ప్రకాశం, బసవయ్య తదితరులు పాల్గొన్నారు.