- ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారు…
- ప్రజావినతుల దినంలో బాధితురాలి ఆవేదన
- న్యాయం చేయాలని మంత్రి సవితకు ఫిర్యాదు
మంగళగిరి(చైతన్యరథం): మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరు లు తన భూమిని కబ్జా చేసి ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితురాలు వాపో యింది. గురువారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వినతుల కార్యక్ర మంలో బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన సంకుల వెంకటరావమ్మ సమస్యను వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ప్రభుత్వం ఇచ్చిన భూమి రికార్డులు తారు మారు చేసి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరులు వైసీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎందూరి కృష్ణారెడ్డి, పల్లపాటి గురుబ్రహ్మంలు కొట్టేశారని వాపోయింది. దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడి పేరు మీద వారసత్వ భూమిగా ఎక్కించారని వారిని ప్రశ్నిస్తే చంపుతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి అడిగినా అక్కడ పట్టించుకోలేదని తన భూమిని విడిపించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.
విద్యాదీవెన జమ కాలేదు
గతంలో జరిగిన వెరిఫికేషన్‌కు సంబంధించిన విద్యాదీవెన డబ్బులు రాని వారు దాదాపు 1100 మంది ఉన్నారని బాధితులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సుమారు రూ.93 కోట్లు పెండిరగ్ ఉందని, సగం మందికి రూ.5 లక్షలు, మిగిలిన 550 మందికి రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉండగా సుమారు పది మంది కోర్టుకు వెళ్లి డబ్బు తెచ్చుకు న్నారని తెలిపారు. మిగతా కేసులు కోర్టులో నడుస్తున్నాయని న్యాయం చేయాలని విన్న వించారు. మంత్రి అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు.
మసీదు ఆస్తులు కొట్టేస్తున్నారు
గుంటూరు లాలాపేట పెద్దమసీదుకు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని వాటిని ఆ మసీద్ ముతవల్లి ఖలీంబేగ్ కొట్టేస్తున్నారని, ఇప్పటికే రెడ్డిపాలెంలో ఉన్న 187 ఎకరాల్లో 12 ఎకరాలను కబ్జా చేశారని కరీమ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అక్కడ ఒక్క ఎకరం విలువ దాదాపు రూ.10 కోట్లు ఉందని, ఇంత ఆస్తులు ఉన్నా మసీదు హక్కు దారులు కూలి పనులకు పోవాల్సి వస్తుందని తెలిపారు. ముతవల్లి ఖలీంబేగ్ ఒక్కడే మసీద్ ఆస్తులను దిగమింగుతూ మసీదు అభివృద్ధిని పట్టించుకోవడం లేదని, గత సంవత్సరం నుంచి కరెంట్ బిల్లు కూడా కట్టలేదని తెలిపారు. అతనిపై ఎన్నో ఫిర్యాదులు చేసినా వక్ఫ్ బోర్డు వాళ్లు పట్టించుకోవడంలేదని ముతవల్లి పదవి నుంచి ఖలీంబేగ్‌ను తొలగించాలని ఫిర్యాదు చేశాడు.
డైరెక్ట్ సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్ ఆఫీస్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న భూమిడి సూర్యకాంతి సమస్యను వివరిస్తూ విధినిర్వహణలో 2013 నుంచి నిబద్ధతతో పనిచేసినందుకు తనకు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్ ఇచ్చా రని.. అయితే చేయని తప్పుకు షోకాజ్ నోటీసులు ఇచ్చి రిలీవ్ చేయకుండా ఆఫీస్ డైరెక్ట ర్ బి.లత్కర్ ఇబ్బందులు పెడుతున్నాడని వాపోయింది. ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగ నివ్వకుండా చేస్తానని బెదిరిస్తున్నాడని కన్నీరుమున్నీరైంది.
బంటుమిల్లి సబ్‌రిజిస్ట్రార్ అక్రమాలు
బంటుమిల్లి సబ్ రిజిస్ట్రార్ కె.శ్రీనివాసరావు ల్యాండ్ మాఫియా, కబ్జాదారులతో చేతులు కలిపి డబ్బులు తీసుకుంటూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారని, గతంలో గుడి వాడ సబ్ రిజిస్ట్రార్‌గా చేసినప్పుడు ఒక రిటైర్డ్ జడ్జి ఆస్తికి భూ కబ్జాదారులతో కలిసి అక్ర మాలకు పాల్పడ్డారని నేడు తమ ఆస్తులను కొట్టేయడానికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించేం దుకు యత్నిస్తున్నాడని కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లికి చెందిన ఏలూరు రంగబాబు, పవన్‌కుమార్, శేషుబాబులు మంత్రికి ఫిర్యాదు చేశారు. తమ దగ్గర ఉన్న ఒరిజినల్ పాసు పుస్తకాలు చూపించినా సబ్ రిజిస్ట్రార్ బుద్ధి మార కుండా కబ్జాదారుల దగ్గర రూ.30 లక్షలు లంచం తీసుకుని తప్పుడు పత్రాలు సృష్టించేందుకు యత్నిస్తు న్నాడని తెలిపారు.
ఉద్యోగాల్లోకి తీసుకోకుండా బెదిరిస్తున్నారని ఆవేదన
ఏపీశాట్ ఆర్‌డీ సంస్థలో గత 10 సంవత్సరాలుగా డీఆర్‌పీలుగా విధులు నిర్వ హిస్తున్న సమయంలో కొందరు అధికారుల పక్షపాత ధోరణితో తమను తాత్కాలికంగా ఉద్యోగాల నుంచి తొలగించారని పలువురు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై పోరాటం చేసి హైకోర్టుకు వెళ్లగా మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పిందని, అయితే డైరెక్టర్ ఎమ్.జగదీష్ ఉద్యోగాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. తాము ఆఫీసుకు వెళితే జగదీష్ వాళ్ల బావ ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌తో చెప్పి చర్యలు తీసుకొం టామని బెదిరిస్తున్నారని వాపోయారు.
పింఛన్ తొలగించి అక్క ఆత్మహత్యకు కారణమయ్యారు
తాను టీడీపీలో పనిచేస్తున్నానని, తన అక్కకు దివ్యాంగురాలి పింఛన్ రాకుండా 2019లో వైసీపీ నేతలు కట్ చేయించడంతో మనస్తాపానికి గురై తన అక్క ఆత్మహత్య చేసుకుందని అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నక్కనదొడ్డి గ్రామానికి చెం దిన శంకర్‌నాయక్ వాపోయాడు. ఆ పింఛన్‌పైనే తన తల్లి ఆధారపడి జీవించేదని.. తాము పనుల కోసం వలసలు పోవడం వల్ల తల్లిని దగ్గర ఉండి చూసుకోలేని పరిస్థితి ఉందని, దయచేసి తన తల్లికి పింఛన్ మంజూరు చేయాలని కోరాడు. తమ భూమిని అక్రమంగా 22ఏలో నమోదు చేశారని.. దాంతో ప్రభుత్వం నుంచి తమ భూములకు రావాల్సిన బెనిఫిట్స్ అందడం లేదని.. అక్రమ నమోదును తొలగించి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పాల్తేరు గ్రామానికి చెందిన దేవవరపు రఘు వేడుకున్నాడు.
స్థలం తీసుకుని పరిహారం ఇవ్వలేదు
కనదుర్గమ్మ వారధి నిర్మాణం అని చెప్పి తన తండ్రి తనకు ఇచ్చిన స్థలాన్ని ప్రభుత్వం తీసుకుని ఎటువంటి పరిహారం ఇవ్వలేదని, స్థలాలు కోల్పోయిన బాధితులకు డబ్బులు, స్థలాలను పరిహారంగా ఇచ్చినా తనకు మాత్రం ఏ పరిహారం ఇవ్వకుండా అన్యాయం చేశారని విజయవాడకు చెందిన రaాన్సీరాణి(76) అనే వృద్ధురాలు వాపోయారు. తన భర్త చనిపోయాడని.. వృద్ధాప్యం కారణంగా ఏ పనిచేసుకోలేనని ఉన్న స్థలాన్ని కూడా ప్రభుత్వం లాక్కొని అన్యాయం చేసిందని ఫిర్యాదు చేసింది. తన తల్లి వీలునామా ద్వారా తనకు సంక్రమించిన 1.25 ఎకరాలను తన సోదరుడు గుడపర్తి అప్పలనాయుడు అధికారులతో కుమ్మక్కై రెవెన్యూ రికార్డుల్లో తన పేరును తొలగించారని, వారిపై చర్యలు తీసుకుని తన పేరును రెవెన్యూ రికార్డుల్లో యధావిధిగా ఉంచాలని తూర్పుగోదావరి జిల్లా తుని మండలం డి.పోలవరం గ్రామానికి చెందిన లగుడు రమణమ్మ విజ్ఞప్తి చేశారు.
టీడీపీ కార్యకర్తనని స్థలాన్ని అగ్రిమెంట్ చేయలేదు
పట్టుగూళ్లు కొని రీలింగ్ చేయుటకు సరిపడు స్థలం లేక స్థలం కోసం అధికా రులకు విన్నవించుకోగా సెలక్షన్ కమిటీ మెంబర్స్ ద్వారా రెండేళ్ల క్రితం మదనపల్లిలోని సిల్క్ రీలింగ్ కాలనీలో డీఐపీ సిస్టమ్ ద్వారా 11 మందికి స్థలం మంజూరుకు సిఫారసు చేశారు. అది పెండిరగ్‌లో ఉండగా ఇటీవల రిటైర్డ్ అయిన డీఎస్‌ఓ రాజశేఖర్ రెడ్డి వైసీపీ వారికి మాత్రమే స్థలాలు అగ్రిమెంట్ చేసి తాను డబ్బులు ఇవ్వని కారణంగా టీడీపీ వ్యక్తి అన్న సాకుతో తనకు స్థలాన్ని అగ్రిమెంట్ చేయలేదని, దీనిపై సెరికల్చర్ డీడీ గుంటూ రులో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితుడు వాపోయాడు. ప్రకాశం జిల్లా దర్శి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన ఏడుకొండలు సమస్యను వివరిస్తూ 2018లో గ్రామంలోని బీసీ కాలనీలో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టామని వాటికి సంబంధించిన బిల్లులు ఇంకా రాలేదని బిల్లులు ఇప్పించాలని కోరాడు.
జీవో 85తో ప్రభుత్వ డాక్టర్లకు అన్యాయం
రూరల్ ప్రాంతాల్లో పనిచేస్తున్న డాక్టర్లకు గతంలో పీజీ కోర్సుల్లో చేరే వారికి 30 శాతం రిజర్వేషన్ కల్పించేవారని, దాన్ని నేడు జీవో నెంబర్ 85ను తీసుకొచ్చి 15 శాతానికి తగ్గించి కాలేజీలను కూడా కుదించారని దాంతో ప్రభుత్వ డాక్టర్లకు అన్యాయం జరుగు తుందని పలువురు డాక్టర్లు మంత్రికి వివరించారు. కాంట్రాక్ట్ పద్దతిలో ప్రైవేట్ డాక్టర్లను ప్రోత్సహిస్తూ వారికి రూ.3 లక్షల వరకు జీతాలు చెల్లిస్తున్నారని.. తమకు అంత జీతాలు ఇవ్వకపోయినా పీజీ పూర్తిచేయడానికి గతంలో ఇచ్చిన రిజర్వేషన్‌ను కొనసాగించి దానికి తగిన వేతనం ఇచ్చేలా చూడాలని కోరారు.