అమరావతి, చైతన్యరథం: అభివృద్ధి పాలన ఎవరిదో..విధ్వంసం ఎవరితో బహి రంగంగా చర్చిద్దామని, అందుకు సిద్ధమా అంటూ జగన్‌రెడ్డికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ప్లేస్, టైం… నువ్వే చెప్పు. ఎక్కడికైనా వస్తా… దేనిమీదై నా చర్చిస్తా. నువ్వు సిద్ధమా జగన్‌రెడ్డీ అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. జగన్ బూటకపు హామీల వీడియో పెట్టి చర్చకు సిద్ధమా అంటూ సోమవారం చంద్రబాబు ‘ఎక్స్’లో పోస్టుపెట్టారు.ఆ పోస్టులో సామా జిక న్యాయానికి నిలువునా శిలువ వేసి… బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి… విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్‌ను కూల్చేసి… ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతా రు జగన్‌రెడ్డీ అంటూ చంద్రబాబు నిల దీశారు.
నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది…ఇంకా 50 రోజులే అని జగన్‌రెడ్డికి గుర్తు చేశారు. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారన్నారు. వరం ఇచ్చి న శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మా సురుడి గతే జగన్‌రెడ్డికీ పడుతుందన్నారు. బూటకపు ప్రసంగాలు కాదు… అభివృద్ది పాలన ఎవరిదో… విధ్వంసం ఎవరిదో తేల్చేందుకు దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబు సవాల్ విసి రారు. తనతో బహింరగ చర్చకు రావాలని ఆదివారమే చంద్రబాబు జగన్‌రెడ్డికి సవాల్ విసిరారు. ఇంకా జగన్‌రెడ్డి స్పందించక పోవడంతో ప్లేస్, టైమ్ నీవే చెప్పమంటూ ఎక్కడికైనా చర్చకు వస్తానని మరోమారు చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ చేశారు.