- విశాఖనుంచి అమలుకు అవకాశం
- రిషికొండకు మకాం మార్చేది అందుకే
- త్వరలోనే విశాఖ ప్యాలెస్‌కు జగన్ ఫ్యామిలీ
- అటునుంచటే లండన్‌కు చెక్కేసే ఛాన్స్
- సంచనల వ్యాఖ్యలు చేసిన దేవినేని
- సచివాలం తాకట్టు హక్కు ఎవరిచ్చారని నిలదీత
అమరావతి(చైతన్యరథం): ఎన్నికల ఫలితాల అనం తరం జగన్ రాష్ట్రంనుంచి పేకప్ చెప్పేయడానికి అద్భు తమైన ప్రణాళిక రచించుకున్నాడని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.విశాఖకు తలమానికమైన రుషికొండకు గుండు కొట్టి, రూ.500కోట్లు ఖర్చుతో ప్యాలెస్ కట్టించుకున్నది ప్రణాళికలో అంతర్భాగమన్నారు. అలాగే, విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే విమానాన్ని విశాఖ నుంచి వెళ్లే లా షెడ్యూల్ మార్చింది కూడా అందుకేనన్నారు. కొద్ది రోజుల్లోనే విశాఖ క్యాంపు ఆఫీసుకు జగన్‌ఫ్యామిలీ మకాం మార్చనుందని, ఎన్నికల అనంతరం జగన్ పేకప్ చెప్పేసి లండన్‌కు చెక్కేయడం ఖాయమని దేవినేని జోస్యం చెప్పారు.
మంగళగిరిలోని తెలుగు దేశం జాతీయ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన జగన్ పాలనా ధోరణిపై విరుచుకుపడ్డారు. రాజధాని భూముల త్యాగా లకు సిద్ధపడిన రైతులు జగన్ అఘాయిత్యాల కారణం గా కొందరు జైళ్లకెళ్తే, మరికొందరు గుండెపోటుతో మరణించారని గుర్తుచేశారు.అలాంటి త్యాగాల భూము ల్లో నిర్మితమైన సచివాలయం, భవనాలను తాకట్టుపెట్టే హక్కు జగన్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రం నెత్తి న 12లక్షల కోట్ల అప్పు గుదిబండ పెట్టిన జగన్, రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి ఏంటో చూపించాలన్నా రు. తెదేపా హయాంలో చంద్రబాబు 68 వేల కోట్లతో పెండిరగ్ అపాజెక్టులను పరుగులు పెట్టించారన్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు 72 శాతం పూర్తి చేస్తే, జగన్ అనేక ప్రాజెక్టులను పడకేయించారన్నారు. నిన్న విశాఖ ప్రభుత్వ కార్యాలయాలు, నేడు రాష్ట్ర సచి వాలయం, రేపు ప్రయివేట్ భూములు.. ఇలా జగన్ తాకట్టుల పాలన ఇంకెంతకాలమని నిలదీశారు.
ఆర్టీసీ ఛార్జీలు, నిత్యావసరాల ధరలు, చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీలు.. ఇలా జగన్ బాదుడుతో జనం విల విల్లాడుతున్నారని దేవినేని మండిపడ్డారు. సెంటు పట్టా సాకుతో జగన్ రూ.7వేల కోట్లు లూటీచేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నాడు`నేడు పథకం కింద రంగులు వేయడం, ప్రహరీగోడ, మట్టి, ప్లాస్టింగ్ పను ల్లో ఎంత లూటీ చేశారో ప్రజలకు తెలుసన్నారు. కోర్టు లో కేసులువేయడానికి వందలకోట్లు వెచ్చిస్తోన్న జగన్, రాయలసీమకు, రైతాంగానిం మొండి చేయి చూపించి సీమ ద్రోహి,రైతు ద్రోహిగా మిగిలాడని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో రోడ్ల దుస్థితి చూస్తుంటే జాలేస్తోందని, రోడ్లపై ప్రయాణిస్తున్న జనం ఆస్పత్రుల పాలవుతున్నా రని దుయ్యబట్టారు. రక్తసిక్తమవుతున్న రోడ్లను చూసీ `జగన్‌కు చీమకుట్టినట్టు కూడా లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో రోడ్ల అభివృద్ధిపై దృష్టిపెట్టిన పాపాన పోలేదని, ఆర్‌అండ్‌బి, పంచాయితీ రోడ్లపై ఒక్కసారి ప్రయాణం చేస్తే ఎంత నరకమో జగన్‌కే అర్థమవుతుందన్నారు. ఇక చెత్తపై పన్నువేసి జనాన్ని చిత్తక్కొట్టే ఏకైక ముఖ్యమంత్రి జగనేనని ఎద్దేవా చేశారు. చెత్త పన్ను, చెత్త ప్రభుత్వం, జగన్‌వి చెత్త పను లంటూ దేవినేని దుమ్మెత్తిపోశారు.దళారులతో కుమ్మక్కై రాష్ట్రాన్ని దోచుకుంటున్న జగన్`9సార్లు విద్యుత్, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజల వెన్ను విరిచాడని ఆగ్రహించారు. చేతకాని పాలనతో అందినకాడికి అప్పు లు చేసి ` రాష్ట్ర ప్రజల నెత్తిన తలసరి 8 లక్షల అప్పు పెట్టిన జగన్‌ను క్షమించలేమన్నారు.
హూ కిల్డ్ బాబాయి అని జనం హోరెత్తిస్తుంటే జగన్ మౌనం పాటించడంలో అర్థమేంటని దేవినేని ప్రశ్నించారు. బహిరంగంగా అక్రమాలకు పాల్పడుతూ, హంతకులకు రక్షణ కల్పిస్తున్న జగన్ కోర్టుల నుంచి తప్పించుకోవచ్చేమోగానీ, ప్రజాకోర్టు నుంచి తప్పించు కోవడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వ మద్యం సీసాల్లో నాసిరకం జగన్ బ్రాండ్లను నింపి, అక్కచెల్లెమ్మల పుస్తె లు తెంపిన పాపం ఊరికేపోదని, జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
తెదేపాదే గెలుపు
ఎన్నికల సంగ్రామం ఎప్పుడు జరిగినా తెలుగు దేశానిదే గెలుపని దేవినేని ధీమా వ్యక్తం చేశారు. జగన్ దోపిడి, అవినీతికి రాష్ట్ర ప్రజలు పుల్‌స్టాప్ పెడతార న్నారు. తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం అధికారం లోకి వస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తథ్యమని జోస్యం చెప్పారు.‘నా వ్యాఖ్యలు వినో, చూసో జగన్ టీవీలు పగులగొడతాడో లేక చెంచాలతో తిట్టి స్తాడో చూడాలని మాజీ మంత్రి దేవినేని సినిమాటిక్ ఛలోక్తి విసిరారు.