యువగళం క్యాంప్ సైట్ నుండి నెల్లూరు జిల్లా టిడిపి ముఖ్య నేత పోలంరెడ్డి దినేశ్ రెడ్డి మాట్లాడుతూ “యువగళం పాదయాత్ర రాయలసీమ నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించినప్పటి నుంచీ, స్థానిక వైసీపీ నేతలు, మంత్రులకు నిద్రపట్టడం లేదు. ఇరిగేషన్ మంత్రిగా ఉండి పోలవరాన్ని ఒక్కశాతంపూర్తిచేయలేని అనిల్ కుమార్, తాను నిర్వహించిన శాఖల్లో ఉత్తమ పనితీరు కనబరిచి, కేంద్రప్రభుత్వ ప్రశంశలు పొందిన లోకేశ్ ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది. లోకేశ్ చేతల మనిషి అయితే.. అనిల్ కుమార్ ఉత్త మాటల మనిషి అని తేలిపోయింది.
గతంలో జగన్ గాలిలో గెలిచిని అనిల్ కుమార్ లాంటివాళ్లు, లోకేశ్ పాదయాత్రతో వచ్చే ఎన్నికల్లో కనుమరుగు కాబోతున్నారు. అనిల్ కుమార్, జగన్మోహన్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలు లోకేశ్ పై పెట్టే శ్రద్ధలో సగాన్ని ప్రజలపై, రాష్ట్రం పై పెడితే మంచిదని సూచిస్తున్నాం. లోకేశ్ మంత్రిగా ఉన్నప్పుడు, టీడీపీ ప్రభుత్వం నెల్లూరు జిల్లా అభివృద్ధి కి రూ.20వేలకోట్లు కేటాయించింది. జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగేళ్లలో నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కేటాయించాడో అనిల్ కుమార్ గానీ, జిల్లా మంత్రులు గానీ చెప్పగలరా? అనిల్ కుమార్ కంటే ఎక్కువగానే మేం మాట్లాడగలం.. కానీ మాపార్టీ విధానం అదికాదు.
నెల్లూరు జిల్లా అభివృద్ధి పై చర్చకుమేం సిద్ధం.. జగన్ హాయాంలో జిల్లాకు ఏం జరిగిందో చర్చించడానికి అనిల్ కుమార్ వస్తాడో, మరొకరు వస్తారో రావచ్చు. తెలుగుదేశం పార్టీని, లోకేశ్ ను విమర్శిస్తే తనకు తన పార్టీ సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో వ్యూస్ ఎక్కువ వస్తాయనే అనిల్ కుమార్ నోటికి పని చెబుతున్నాడు. దాని వల్ల ప్రజలకు ఒరిగేదేం లేదని అతను తెలసుకుంటే మంచిది.” అని పోలంరెడ్డి దినేశ్ రెడ్డి అన్నారు.