అమరావతి: వైకాపా పెద్దల ఆదేశాలతో కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజాస్వామ్యం సిగ్గుపడు తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. రాక్షస రాజులు కూడా సైకో జగన్‌లాంటి దుర్మార్గచర్యలకు పాల్పడలేదని ఒక ప్రకటనలో లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం చీకలగురిలో వైకాపా జెండాని కాల్చేశారనే ఆరోపణలపై టీడీపీ కార్యకర్త, బీసీ బోయ సామాజిక వర్గానికి చెందిన చంద్రమోహన్‌ని అరెస్టు చేసిన పోలీసు లు, కొడుతూ నగ్నంగా నడిపించిన ఘోరం చూశాక నా గుండె చెదిరిపోయింది. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించిన మీరు ప్రజాధనం జీతంగా తీసుకునే పోలీసులా? ఫ్యాక్షనిస్టు జగన్ కిరాయి సైన్యమా అని లోకేష్ ప్రశ్నించారు. ఒక కరడుగట్టిన నేరగాడు పెట్టిన పార్టీ జెండా అంత పవిత్రమైనదా! జాతీయ జెండా పెడతా మనడం నేరమా? మా టీడీపీ సైనికుడు చంద్రమోహన్ నగ్నంగా ఊరేగించారు, పక్కటెముకలు విరగ్గొట్టారు. మీరు చేసిన నరరూప రాక్షస చర్యలకు చట్టబద్ధమైన శిక్ష అనుభవించేందుకు సిద్ధంగా ఉండండని లోకేష్ హెచ్చరిం చారు. టీడీపీ కార్యకర్త చంద్రమోహన్‌ని పోలీసులు హింసిస్తున్న వీడియోను లోకేష్ విడుదల చేశారు.