గుంటూరు: మంత్రి విడదల రజని కార్యాలయంపై దాడి జరిగిందంటూ పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తూ, అమా యకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యు డు, మాజీమంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. ఈ దాడిపై పలు అను మానాలున్నాయన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశా రు. మంత్రి విడదల రజనీ ఆఫీస్‌పై ఆది వారం రాత్రి జరిగిన దాడి ఘటనలో 30 మందిపై పోలీసులు కేసు నమోదుచేశా రు. అక్రమంగా కేసులుపెట్టి అరెస్ట్‌చేసి న నిందితులను వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అరెస్టు చేసిన బాధితులను జీజీహెచ్‌లో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, జన సేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు, టీడీపీ నేతలు నజీర్ అహమ్మద్, కనపర్తి శ్రీనివాసరావు, మన్నవ సుబ్బా రావు, వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్(బుజ్జి), ముజీబ్, తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం పరామర్శించా రు. ఈసందర్భంగా ఆనందబాబు మాట్లా డుతూ… నూతన సంవత్సరం సందర్భం గా ప్రతి ఏడాది ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పిస్తార న్నారు. ఆ ప్రాంతంలోనే మంత్రి విడదల రజని కార్యాలయం ఏర్పాటుచేయటంతో అక్కడ పోలీసులు ఆంక్షలు విధించారన్నా రు. మంత్రి రజని కార్యాలయం ఉంది కాబట్టి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకు న్నారు.
ఈ సందర్భంగా జరిగిన తోపు లాట, గందరగోళంలో రజనీ ఆఫీస్‌పై రెండు రాళ్లు పడ్డాయట. దీంతో పోలీసు లు, వైసీపీ నేతలు నానా యాగీ చేస్తున్నా రు. ఆదివారం రాత్రంతా పోలీసులతో కలిసి వైసీపీ నేతలు అరాచకం సృష్టించా రు. రోడ్డుపై వెళ్లే వాళ్లను సైతం అడ్డు కుని వివిధ స్టేషన్‌లకు తరలించి తప్పుడు కేసులు పెట్టారు. ప్రభుత్వం నుంచి వచ్చి న ఒత్తిడితో అమాయకులపై కేసులు పెట్టారు. విడదల రజని గుంటూరు వెస్ట్ ఇన్చార్జ్‌గా రావడం వైసీపీ నేతలకే ఇష్టం లేదు. వైసీపీలోని గ్రూపు తగాదాలతో వాళ్లే రాళ్లు వేసుకున్నారనే అనుమానం ఉంది. దీనిపై పూర్తిస్దాయిలో విచారణ చేయాలని పోలీసులను ఆనందబాబు కోరారు.